హోండా యాక్టివా స్కూటర్‌ను సీఎన్జీకి మార్చుకుంటే 100 కి. మైలేజ్...!
యాక్టివాను కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)కి మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. పెట్రోల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివా యూజర్లకు ఓ సంస్థ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తున్నది. సీఎన్జీ కిట్ ను అందిస్తున్నది. ఆ సంస్థ. ఇలా మార్చుకోవడం వల్ల పెట్రోల్ అవసరంలేకుండానే సీఎన్జీ తో ఎక్కువ మైలేజ్ పొందవచ్చు. అలాగే సీఎన్జీకి మార్చుకునేందుకు ఖర్చుకూడా తక్కువే.
హోండా యాక్టివా స్కూటర్‌ను వినియోగదారులు సీఎన్జీకి మార్చుకోవచ్చు. అందుకు గాను సీఎన్జీ కిట్‌ను "లొవాటో "అనే కంపెనీ అందిస్తున్నది. రూ.15వేలకే సీఎన్జీ కిట్‌ను అమర్చుకోవచ్చు. అయినప్పటికీ అందులో పెట్రోల్ కూడా పోయవచ్చు. అది ఎమర్జెన్సీలో పనికొస్తుంది. సీఎన్జీ కిట్‌లో 1.2 లీటర్ల సిలిండర్ ఉంటుంది. దీని ద్వారా 120 నుంచి 130 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.
అనంతరం సిలిండర్‌ను రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. యాక్టివాను సీఎన్జీకి మార్చుకోవడం ద్వారా లీటర్‌కు 100 కిలోమీటర్ల మైలేజీ పొందవచ్చు. ప్రస్తుతం సీఎన్జీ ధర రూ.47 నుంచి రూ.48 వరకూ ఉంటుంది. సీఎన్జీకి మార్చిన తరువాత అవసరాన్ని బట్టి పెట్రోల్ మోడ్‌కు, లేదంటే సీఎన్జీ మోడ్‌కు మారేందుకు వీలుగా స్విచ్ ఆప్షన్ ఉన్నది.
