పదో తరగతి పాసైతే గవర్నమెంట్ జాబ్. నెలకు రూ. 35 వేల జీతం.
పదో తరగతి పాసైతే గవర్నమెంట్ జాబ్. నెలకు రూ. 35 వేల జీతం.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 108 ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సీ) పోస్టులు భర్తీ చేయబోతోంది.
ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది నాబార్డ్. అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. దరఖాస్తులను నమోదు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 21గా పేర్కొన్నారు.
నాబార్డ్ భర్తీ చేయబోతున్న ఈ పోస్టులకు పదో తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు జీతం నెలకు రూ.35,000 గా ఉంటుంది.
అప్లై చేసే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలకు https://www.nabard.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఇతర వివరాలు చూస్తే…
బ్యాంక్ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)
ఉద్యోగం పేరు: ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సీ)
సంఖ్య: 108
ఉద్యోగ స్థలం: ముంబై
జీతం: ప్రతి నెలా రూ. 35,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 2, 2024
దరఖాస్తులు ఇవ్వడానికి చివరితేది: అక్టోబర్ 21, 2024.
దరఖాస్తు ప్రక్రియ ఇలా…
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం డైరెక్ట్ గా https://www.nabard.org/ లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.