ప్రపంచ విషపూరిత నదుల్లో మూసీ స్థానం ఎంతంటే...!
ప్రపంచ విషపూరిత నదుల్లో మూసీ స్థానం ఎంతంటే...!
ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్‌లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుషితమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణ బాధలు తొలగించే మంత్రాలు : రుణ విముక్తి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.