Top Ad unit 728 × 90

నో ఎగ్జామ్స్, ఆల్ పాస్...!

నో ఎగ్జామ్స్, ఆల్ పాస్...!

 

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాఠశాలలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వార్షిక పరీక్షలు రాసే అవసరం లేకుండానే పై తరగతుల్లో చేరే వెసులుబాటును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు.

 

అంతేకాదు, మార్చి 24న జరిగిన ప్లస్2 పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మరో రోజు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం మాత్రమే కాదు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా అక్కడి ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి లోపు విద్యార్థులకు జరగాల్సిన వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులంతా ''ఆల్ పాస్'' అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పై తరగతులకు వారిని పరీక్షలు లేకుండానే పంపించనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం వెల్లడించింది.

 

నో ఎగ్జామ్స్, ఆల్ పాస్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *