Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

 7శాతం పెరిగిన మహిళలపై నేరాలు...!

7శాతం పెరిగిన మహిళలపై నేరాలు...!

 

దేశంలో అత్యాచార నేరాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. 2019లో భారతదేశంలో అత్యాచార నేరాలకు సంబంధించి జాతీయ డేటా విడుదల అయింది డేటాలో దేశంలో ప్రతిరోజు  సగటున 87 అత్యాచార కేసులు నమోదుతున్నాయని వెల్లడించింది. 2019 ఏడాది సమయంలో మహిళలపై అత్యాచార నేరాలకు సంబంధించి 4,05,861 కేసులు నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో  విడుదల చేసిన జాతీయ డేటా నివేదిలో పేర్కొందినివేదిక ప్రకారం 2019 ఏడాదిలో మహిళలపై అత్యాచార నేరాలు 7.3 శాతానికిపైగా పెరిగిందని వెల్లడించింది. దేశంలో ఒక లక్ష మంది మహిళల్లో 2018లో 58.8 శాతంగా ఉన్న క్రైమ్ రేటు 2019లో 62.4 శాతం మేర క్రైమ్ రేటు పెరిగింది. 2018లో మహిళలపై నేరాలు 3,78,236 కేసులు నమోదయ్యాయినట్టు డేటా పేర్కొంది. దేశవ్యాప్తంగా 2017లో 32,559 అత్యాచార నేరాలు నమోదు కాగా 2018 నాటికి 33,356 అత్యాచార నేరాలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. భారత పీనల్ కోడ్ (IPC) కింద నమోదైన చాలా మహిళలపై నేరాల్లో మేజార్టీ కేసులు భర్త క్రూరత్వం లేదా బంధువులు పాల్పడిన కేసులు 30.9 శాతం మేర నమోదయ్యాయి. మహిళలపై దాడి కేసుల్లో 21.8 శాతం ఉండగా, కిడ్నాప్, మహిళలను ఎత్తుకెళ్లిన నేరాలు (17.9శాతం) నమోదైయ్యాయని NCRB డేటా 2019లో వెల్లడించింది. మహిళలపై మాత్రమే కాదు.  చిన్నారులపై కూడా నేరాల శాతం అధికంగా ఉందని NCRB పేర్కొంది. 2018 నుంచి చిన్నారులపై నేరాలు పెరుగుతూ 2019 నాటికి 4.5 శాతం మేర పెరిగాయని డేటా పేర్కొంది. 2019లో మొత్తంగా చిన్నారులపై జరిగిన నేరాలు 1.48 లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో 46.6 శాతం కిడ్నాపింగ్ కేసులు, లైంగిక నేరాల కింద 35.3 శాతం కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 53 మెట్రోపాలిటిన్ నగరాల్లోని నేరాల డేటాను NCRB సేకరించి విశ్లేషించింది.

 7శాతం పెరిగిన మహిళలపై నేరాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *