Top Ad unit 728 × 90

చెలరేగిన నితీశ్ రాణా నరైన్ఢిల్లీ ఎదుట భారీ విజయ లక్ష్యం...!

చెలరేగిన నితీశ్ రాణా నరైన్ఢిల్లీ ఎదుట భారీ విజయ లక్ష్యం...!

 

ఢిల్లీ కేపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నితీశ్ రాణా, సునీల్ నరైన్లు అర్ధ సెంచరీలతో విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కోల్కతా 194 పరుగులు చేసింది. శుభ్మన్గిల్ (9), రాహుల్ త్రిపాఠి (13), దినేశ్ కార్తీక్ (3) దారుణంగా విఫలమైనా నితీశ్ రాణా, నరైన్లు చెలరేగిపోయారు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 53 బంతులు ఎదుర్కొన్న రాణా 13 ఫోర్లు, సిక్సర్లతో 81 పరుగులు చేసి అవుట్ కాగా, 32 బంతులు ఎదుర్కొన్న నరైన్ 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్ 17 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిక్, రబడ, స్టోయిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

చెలరేగిన నితీశ్ రాణా నరైన్ఢిల్లీ ఎదుట భారీ విజయ లక్ష్యం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *