Top Ad unit 728 × 90

పాకిస్థాన్ గూఢచారి రాజస్థాన్‌లో అరెస్ట్...!

పాకిస్థాన్ గూఢచారి రాజస్థాన్లో అరెస్ట్...!

 

పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిని తదుపరి ప్రశ్నించేందుకు జైపూర్ తీసుకెళ్ళారు. నెలలో ఇదే ఆరోపణలపై జరిగిన రెండో అరెస్టు ఇది. రాజస్థాన్ పోలీస్ ఏడీజీ (ఇంటెలిజెన్స్) తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని రాజస్థాన్లోని బామర్లో అరెస్టు చేశారు. వ్యక్తిని తదుపరి ప్రశ్నించేందుకు జైపూర్ తీసుకెళ్ళారు. ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తూ పట్టుబడిన కేసుల్లో ఇది నెలలో రెండోది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (నాసిక్ యూనిట్) ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగి దీపక్ షిర్సత్ను అరెస్టు చేసింది. విదేశీ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం ఉద్యోగి గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపించింది. భారతీయ యుద్ధ విమానాలకు, నాసిక్లోని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని దీపక్ ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు తెలిపింది. దీపక్ నాసిక్లోని క్రిటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ డివిజన్లో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయనపై నాసిక్ పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్, మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాయి. ఆయన విదేశీయుడితో సమావేశమవడాన్ని కూడా గుర్తించాయి. తాను పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటానని దీపక్ వెల్లడించినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (హెచ్ఏఎల్)కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించినట్లు చెప్పినట్లు సమాచారం. ఓజార్లోని హెచ్ఏఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, నాసిక్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్బేస్, ఇతర ప్రొహిబిటెడ్ ఏరియాస్ సమాచారాన్ని పంపించినట్లు అంగీకరించాడని తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సెప్టెంబరులో గిటేలి ఇమ్రాన్ను అరెస్టు చేసింది. గుజరాత్లోని గోద్రాకు చెందిన ఇమ్రాన్ ఐఎస్ఐ ఏజెంటు. క్రాస్ బోర్డర్ క్లాత్ ట్రేడర్ ముసుగులో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఎన్ఐఏ తెలిపింది.

పాకిస్థాన్ గూఢచారి రాజస్థాన్‌లో అరెస్ట్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *