Top Ad unit 728 × 90

ఆనాడు పుల్వామాపై రాజకీయం చేశారే...!

ఆనాడు పుల్వామాపై రాజకీయం చేశారే...!

 

గతేడాది జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్ష పార్టీలు దారుణంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యావత్భారతావని తమ బిడ్డల్ని కోల్పోయామన్న వేదనలో ఉంటే కొందరు మాత్రం ఎలాంటి బాధ లేకుండా తమ స్వార్థ ప్రయోజనాలను చూసుకున్నారని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు పుల్వామా దాడి చేసింది తామేనంటూ పాకిస్థాన్అంగీకరించడంతో అలాంటి వారి నిజస్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. ఉక్కు మనిషి సర్దార్వల్లభాయ్పటేల్జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని కేవడియాలో గల ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించిన మోదీ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. 'తమ బిడ్డల్ని కోల్పోయామని భారతవని గుండెపగిలే వేదన అనుభవిస్తుంటే కొందరు కనీసం బాధపడలేదు. జవాన్ల గురించి బాధపడటం మాని కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఘటనను రాజకీయం చేశారు. సైనికుల త్యాగాలను ప్రశ్నించారు. జవాన్ల మరణంతో గాయపడిన నా మనసు ఆరోపణలను మౌనంగా భరించింది. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నిజం బయటపడింది. పుల్వామా దాడిలో తమకు ప్రమేయం ఉందంటూ పొరుగుదేశం పాకిస్థాన్తమ పార్లమెంట్లోనే అంగీకరించింది. దీంతో ఘటనపై రాజకీయాలు చేసిన వారి నిజస్వరూపం బయటపడింది. అలాంటి వారిని నేను కోరేది ఒక్కటే దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని అలాంటి రాజకీయాలు చేయకండి' అని మోదీ దుయ్యబట్టారు. రోజు ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని మోదీ అన్నారు. హింసతో ఎవరూ ప్రయోజనం పొందరని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 'కొవిడ్మహమ్మారి బారిన పడతామని గతేడాది ఎవరూ ఊహించలేదు. కానీ పరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చింది. వైరస్కు ఎదురొడ్డి ధైర్యంగా పోరాడుతోంది. ఇప్పడిప్పుడే మహమ్మారి నుంచి బయటపడగలుగుతున్నాం' అని మోదీ చెప్పుకొచ్చారు. ఐక్య భారతానికి రోజు దేశం కొత్త కొలమానాలను సృష్టిస్తోందని మోదీ అన్నారు. అభివృద్ధిలో కశ్మీర్కొత్త పథంలో పయనించడం, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి పునరుద్ధరణ ఇందుకు నిదర్శనమన్నారు.

 

ఆనాడు పుల్వామాపై రాజకీయం చేశారే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *