Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

చైనాకు భారత్ పిలుపు...!

చైనాకు భారత్ పిలుపు...!

 

న్యూఢిల్లీ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిలిచిపోయిన దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి కలిసి రావాలని చైనాకు భారత్ పిలుపు ఇచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపైనే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.

వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగాలను ఖాళీ చేసేందుకు చైనా నిరాసక్తత వ్యక్తం చేస్తోందని వార్తలు వస్తున్న సమయంలో, భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ భారత దేశ వైఖరిని వివరించారు. దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి భారత్తో కలిసి రావాలని చైనాను కోరారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలు, ప్రోటోకాల్స్కు అనుగుణంగా దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఇరు దేశాలు చాలా సమావేశాలు నిర్వహించాయి. కానీ పాంగాంగ్ సరస్సు డెప్సాంగ్ వంటి ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా దళాల ఉపసంహరణ నిలిచిపోయింది.

వారానికోసారి నిర్వహించే మీడియా సమావేశంలో శ్రీవాస్తవ మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో దళాల ఉపసంహరణ లక్ష్యం దిశగా నిజాయితీగా పని చేసేందుకు చైనా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అంగీకరించిన సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత పూర్తిగా పునరుద్ధరణ జరిగేందుకు, ఉద్రిక్తతలు తగ్గేందుకు కలిసి రావాలని కోరారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు.

 

చైనాకు భారత్ పిలుపు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *