Top Ad unit 728 × 90

నిర్భయ తల్లిని శిక్షించాలిః ఏపీ సింగ్

నిర్భయ తల్లిని శిక్షించాలిః ఏపీ సింగ్

 

ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. కొద్దిసేపటి క్రితం తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్‌సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా, తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి.

 

ఇదిలా ఉంటే న్యాయ వ్యవస్థలోని పలు లొసుగులను వాడుకుంటూ, ఏడేళ్ల పాటు ఈ నలుగురిని శిక్ష నుంచి తప్పిస్తూ వచ్చిన న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను శిక్షించాలంటూ అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

 

రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్బయ తల్లి ఆశాదేవిని శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. కాగా, అతడు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అటు కరోనాతో లింక్ పెట్టి, కేంద్రం మాస్కులు తయారు చేయడంలో ఆలస్యం చేస్తుందని, ఉరి త్రాళ్లను మాత్రం తొందరగా తయారు చేస్తుందని అన్నాడు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏపీ సింగ్‌ను కూడా ఉరి తీయాలంటూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

నిర్భయ తల్లిని శిక్షించాలిః ఏపీ సింగ్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *