Top Ad unit 728 × 90

కరోనా రోగులనుండి ఇంతకంటే ఎక్కువ వసూలు చేయరాదు...!

కరోనా రోగులనుండి ఇంతకంటే ఎక్కువ వసూలు చేయరాదు...!

 

కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలుచేయకుండా, తెలంగాణ ప్రభుత్వం ధరలను ప్రకటించింది. ఈ మేరకు జీవో. 40 జారీ చేసింది. ప్రభుత్వం పేర్కొన్న ధరలనే కరోనా రోగుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి ధరలను ఖరారు చేసింది. జీవోను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్టయ్యంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ప్రకారమే ఇక నుంచి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేయాలని ఆదేశించింది.

 

కరోనా రోగులను చేర్చుకున్న ఆసుపత్రులు ఇక సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500 వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలుగా ఖరారు చేశారు. పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదని తెలిపింది. హెచ్ఆర్‌సీటీ - రూ. 1995, డిజిటల్ ఎక్స్‌రే - రూ. 1300, ఐఎల్6 - రూ. 1300, డీ డైమర్ పరీక్ష - రూ. 300, సీఆర్‌పీ - రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ - రూ. 1400, ఫెరిటిన్ - రూ. 400, ఎల్ డీహెచ్ - రూ. 140గా ఖరారు చేశారు. సాధారణ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీటర్‌కు రూ. 75, ఆక్సిజన్ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్‌కు రూ. 125గా ఖరారు చేశారు.

కరోనా రోగులనుండి ఇంతకంటే ఎక్కువ వసూలు చేయరాదు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *