తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ విన్నా...!
ఏం జరుగుతుంది. ఏం జరగబోతుంది. అసలేం జరిగింది. ఇలా ఏదేదో మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎవరు ఏం మాట్లాడుకున్నా లోకల్ ఎలక్షన్ గురించే. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా దీనికే ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ ఫుల్ రాజకీయాలు. ఎమ్మెల్యే ఎన్నికలు అంటే పోటీదారు ఎక్కడో ఉంటారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలు అంటే పోటీ దారు ఊళ్లోనే ఉంటారు. ఎంతమంది పోటీ చేస్తున్నారు. ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు. సర్పంచ్ గా నిలిచేది ఎవరు, ఉప సర్పంచ్ ప్రయత్నాలు ఎలా చేయాలి. అసలు వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి. వార్డులో గెలవాలంటే ఏం చేయాలి. ఇలాంటి లెక్కలు ఎన్నో. అవి కూడా ప్రతి ఊళ్లోనూ ఎన్నికలు. ఆ ఊళ్లోనే విజయం. అందుకే, సీఎం ఎవరు అవుతారు అనే పాయింట్ కంటే కూడా ఊళ్లో సర్పంచ్ ఎవరు అవుతారు అనేదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చోటా ఇదే టాపిక్ నడుస్తోంది.
జనంలో నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉందంటే నమ్మండి. జనాలు ఎక్కడా తగ్గడం లేదు. ఎవరి పాలిటిక్స్ వాళ్లు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కటే టాపిక్. ఎన్నికలు జరిగితే బావుండు. ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి. ఇంటి ముందు డ్రైనేజీలు క్లీన్ కావడం లేదు. ఊళ్లో ఉన్న కంప చెట్లు నరికే దిక్కు లేరు. ఊళ్లో ఉన్న స్తంభాలకి లైట్లు వేసే నాథుడే లేడాయే. ఎవరూ పట్టించుకోవడం లేదాయే. కొత్త సర్పంచ్ లు వస్తే ఊళ్లో కొన్నాళ్ల పాటు ఈ సమస్య ఉండదు. ఇలాంటి లెక్కల్లో ఉన్నారు జనాలు.
అందుకే, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అంత డిమాండ్ పెరిగింది. ఈ ఎవ్వారమేమో ఆ కోర్టు ఈ కోర్టు అంటున్నారు. ఒక్కో కోర్టుకి ఇన్ని సార్లు వెళ్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది ఇదే కావచ్చు కూడా. ఇప్పుడు సుప్రీంలో ఏం జరుగుతుంది. అసలు ఎన్నికల కోడ్ ఉందా లేదా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏం చేయబోతున్నారు. సుప్రీం తర్వాత మళ్లీ హైకోర్టుకి ఏమైనా వెళ్తుందా ఇష్యూ అంటూ... అరుగుల మీద కూర్చుని ఊళ్లో ఉండే పచ్చని చెట్ల కింద గుంపులు గుంపులు గా కూర్చుని ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అంటే నమ్మండి.
