ఆ ఎస్సైఆత్మహత్యకు అసలు కారణం అదేనా...!
ఆ ఎస్సైఆత్మహత్యకు అసలు కారణం అదేనా...!
పోలీసులు.., వివిధ సమస్యలతో ఆత్మహత్యల వరకు వెళ్లేవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకొస్తారు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడలో ఎస్సై సూసైడ్ కలకలం రేపింది. పట్టణ టూటౌన్ ఎస్సై పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అపార్ట్ మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే విజయ్ కుమార్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా అనుమానిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012లో హనుమమాన్ జంక్షన్ ఎస్సైగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై గతంలో సస్పెన్షన్ కు గురయ్యారు.
సస్పెన్షన్ ముగిసిన తర్వాత విజయ్ కుమార్ కు గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ వచ్చింది. మూడు నెలల క్రితమే విజయ్ కుమార్ కు పెళ్లైంది. ఐతే భార్యను కాపురానికి తీసుకురాకుండా, గుడివాడలోనే బ్యూటీషియన్ తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ఇంతవరకు తెలియరాలేదు. అపార్ట్ మెంట్ లో సూసైడ్ నోట్ కూడా లభించనట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం అపార్ట్ మెంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎస్సైతో వివాహేతర సంబంధం ఉన్న మహిళతో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విజయ్ కుమార్ ఫోన్ కాల్ రికార్డ్స్ ను పోలీసులు పరిశీలుస్తున్నట్లు సమాచారం. ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
బెదిరంపులే కారణమా: మూడు నెలల క్రితం పెళ్లైనా బ్యూటీషియన్ తోనే విజయ్ కుమార్ అపార్టుమెంటులో సహజీవనం చేస్తున్నాడు. 3 నెలల కిందట వివాహం జరిగినా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భార్య తరపు బంధువుల నుంచి ఒత్తిడి రావడం, కాపురం పెడితే తనతో ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని ప్రియురాలు బెదిరించడం వల్ల విజయ్ కుమార్ ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇటు బ్యూటీషియన్ బెదిరింపులు, మరో వైపు భార్యను కాపురానికి తీసుకురాకపోవడంతో అటు వైపు నుంచి ఒత్తిడి పెరిగడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
