జనకా అయితే గనక: ఒక మిడిల్ క్లాస్ జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో ఎమోషన్స్
జనకా అయితే గనక: ఒక మిడిల్ క్లాస్ జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో ఎమోషన్స్
ఒక మిడిల్ క్లాస్ జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో ఎమోషన్స్. తెలివి ఉండాలి కానీ ప్రతి ఎమోషన్ ఒక అద్భుతమైన కథే. అందుకే ఫ్యామిలీ సినిమా అంటే రచయితలు ముందుగా చూసేది మధ్యతరగతి.
సుహాసి హీరోగా, దిల్ రాజుగా ప్రొడక్షన్లో జనకా అయితే గనక కూడా ఓ మిడిల్ క్లాస్ స్టోరీనే కావడం విశేషం. ఈ జనరేషన్లో జంటలు పిల్లలను కనాలంటే ఎందుకంత ఆలోచించాల్సి వస్తుందో అనే అంశాన్ని మధ్య తరగతి నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో, దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఒకసారి చూద్దాం.
(ప్రసాద్) సుహాస్ ఓ మిడిల్ క్లాస్ పర్సన్. తనకు పిల్లలు కనడం పట్ల ఒక క్లారిటీ ఉంటుంది. పిల్లని కంటే వాళ్ళకి అన్నీ ద బెస్ట్ ఇచ్చేలా ఉండాలి, లేదాంటే కనకూడదు అనేది అతని ఫిలాసఫీ. నెలకి వచ్చే రూ.30 వేల జీతంతో పిల్లలకు ద బెస్ట్ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే పెళ్ళై రెండేళ్లు గడిచిన పిల్లల జోలికి వెళ్లకుండా ఉంటారు. ప్రసాద్ భార్య సంగీతా విపిన్.. సుహాస్ మనసును అర్థం చేసుకుంటుంది. ఇంట్లో పెద్దవాళ్లు, పిల్లలు ఎప్పుడూ అంటూ అడుగుతారు.. ఈరోజుల్లో ఒక పిల్లోడిని పెంచాలి అంటే కోటి రూపాయలు కచ్చితంగా కావాలంటూ ప్రాక్టికల్ గా ప్రసాద్ తండ్రి గోకరాజు రమణకు చూపిస్తాడు. చేసేదేమీ లేక అందరు సైలెంట్ అయిపోతారు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో కుటుంబ నియంత్ర కోసం వాడుతున్న కాండోమ్ సరిగ్గా పని చేయలేదంటూ కంపెనీపై కేసు పెడతాడు ప్రసాద్. తర్వాత ఏం జరిగింది.. ఈ కేస్ ఎలాంటి మలుపులు తిరిగింది, కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టిన ప్రసాద్ కేసును గెలిచాడా, అనేదే మిగతా స్టోరీ.
ఏదైనా మంచి ఐడియా ఉంటే దానిని కథ రూపంలో తీసుకువచ్చేటప్పుడు మరింత క్రియేటివిటీ ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే అసలైన పనితనం బయటపడుతుంది. ట్రైలర్‌తో ఐడియా ప్రజెంట్ చేసిన క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కల్పించే విజన్ ఉండాలి. ఇందులో పాయింట్ ఇంటర్వెల్ ముందువరకు ఓపెన్ కాలేదు. అప్పటివరకు ఏదో టైం పాస్ వ్యవహారంలా అనిపించింది. దీంతో ఫస్ట్ ఆఫ్ జస్ట్ పర్లేదు అనిపించింది. భార్యాభర్తల ఎమోషన్ బిల్డ్ చేయడానికి చాలా టైం పట్టింది. తర్వాత కూడా అసలు పాయింట్ చెప్పకుండా ప్రసాద్ జాబ్ చుట్టూ, పాత్ర చుట్టూ సినిమాను చాలా సేపు తిప్పారు. అదంతా ఎంటర్టైమ్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం ఉన్న డేస్ లో పిల్లాడిని పెంచాలంటే ప్రాక్టికల్ గా ఎంత ఖర్చవుతుందో చూపించే సీక్వెన్స్ మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది.
ఇంటర్వల్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిని పెంచింది. ఇక హీరో సుహాస్ ఇప్పటికే ఇలాంటి మిడిల్ క్లాస్ పాత్రలో ఎన్నింటిలోనూ నటించాడు. తనకు ఒక నేచురల్ స్టైల్ ఉంది. ఇక చాలాచోట్ల రెగ్యులర్ గా కనిపించి ఆకట్టుకుంటాడు. పైగా సుహాస్ ఎంచుకునే పాత్రలు కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అతను ఎమోషన్స్ కు చాలా మంది కనెక్ట్ అవుతారు. కారణం సుహాస్ క్యారెక్టర్ని ఎంచుకునే విధానం. ఇక ఈ సినిమాలో పిల్లల విషయంలో కేవలం ఖర్చునే చూస్తాడు.. ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టేసే క్యారెక్టర్లు సుహాసినిటించాడు. అయితే చివరిలో క్యారెక్టర్ టర్న్ అయిన విధానం చాలా నేచురల్ గా అనిపిస్తుంది. పైగా పిల్లల విషయంలో తన ధోరణి చాలా ఓపెన్సివ్గా కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరు గొప్పవాళ్ళు కానప్పుడు.. పిల్లలను కనీ ఏం చేయాలి అంటూ ప్రసాద్ ఓచోట ప్రశ్నిస్తాడు.
ఇలాంటి క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కలవదు.ఇక సంగీత విపినీ నటనత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అప్పటివరకు అసమర్థ లాయర్ గా కనిపించిన వెన్నెల కిషోర్.. పాత్ర చివర్లో ఎగరేసివ్ కావడం, కాండోమ్ కిషోర్ అనే బిరుదు రావడంతో.. బిరుదు ఎలా ఉంది అని అడగగా, ఆ బిరుదు నీ పిరుదలలా ఉంది అంటూ సెటైరికల్ గా వేసిన కౌంటర్, ప్రేక్షకులను నవ్వులు పోయిస్తాయి. ఇక మురళి శర్మ సెకండ్ హాఫ్ లో సినిమాకు కాస్త హైప్ పెంచే ప్రయత్నం చేశాడు. రాజేంద్రప్రసాద్ జడ్జ్ పాత్రలో ఓవర్ ది బోర్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపించుకుంది. విజయ్ బుల్ గాని సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ కాకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కెమెరామెన్ సాయి శ్రీరామ్ పనితనం డీసెంట్ గా ఉంది. ఇల్లు, కోర్టు చుట్టూ నడిచే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉంచారు. అయితే గుర్తుపెట్టుకునే అంత మంచి డైలాగ్స్ లేవు. డైరెక్టర్ ఓ మంచి ఐడియాను తీసుకున్న, ఐడియా లో ఉన్న ఆసక్తి సినిమాల్లో చూపించలేకపోయారు. ఐడియా బలంగా చూపించినట్లైతే సినిమా మరింత బెటర్ గా అనిపించేది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న.. కాస్త అటు ఇటు అయి ఉంటే సినిమా విపరీతంగా ట్రోల్స్ ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. దీని వీలైనంత రీసెంట్ గా తెరకెక్కించారు. కామెడీ సెటప్, వెన్నెల కిషోర్ టైమింగ్ సినిమాను నడిపిస్తాయి. చివర్లో బామ్మ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. అదేంటో సినిమాలో చూడాల్సిందే.