Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మీరు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని బయటకు వెళ్తున్నారా...?

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సీజన్ కావడంతో డబ్బులతో బయట అడుగు పెట్టేముందు సారి ఆలోచించండి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నగదు తీసుకుని వెళ్లడంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అయితే, ప్రత్యేక సందర్భాలు ఏంటో తెలుసుకోవాలి. అవేంటో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది.


ఎవరైనా ఒక వ్యక్తి వైద్య అవసరాల నిమిత్తం పరిమితికి మించి డబ్బును తీసుకుని వెళ్లవచ్చు. అయితే, వారు మెడికల్ కోసమే తీసుకుని వెళ్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపించాలి. అంటే, మెడికల్ అడ్మిషన్, మెడికల్ ట్రీట్మెంట్కు సంబంధించిన ఆధారాలు, బిల్లులు వగైరా సమర్పించాలి.హైదరాబాద్ మహానగరం. ఇక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తుంటారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి వారి సంగతి ఏంటి అనుకుంటున్నారా? వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధన తీసుకొచ్చింది. వ్యాపారులు తమ వ్యాపార ప్రదేశం నుంచి బ్యాంకులో నగదు జమ చేయడానికి తీసుకుని వెళ్లే వారు తప్పనిసరిగా పాన్ కార్డు, బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ తప్పనిసరిగా ఉండాలి. క్యాష్ బుక్ కాపీ కూడా తప్పనిసరి. అకౌంట్లో రెగ్యులర్గా డిపాజిట్లు వేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు మీతోపాటు ఉంచాలి. లేకపోతే నగదును సీజ్ చేస్తారు.

ఇక పెళ్లి కోసం పెద్దమొత్తంలో నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. అలాంటి నగదును సీజ్ చేయరు. అయితే, పెళ్లికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. శుభలేఖ, కళ్యాణమండపం లేదా ఫంక్షన్ హాల్ బుకింగ్ రిసిప్ట్, ఇతరత్రా పెళ్లికి సంబంధించిన పత్రాలు మీతో పాటు ఉండాలి. పెళ్లి కోసం తీసుకుని వెళ్లే బంగారం, నగలు లేదా వ్యక్తిగతంగా తీసుకుని వెళ్లే బంగారం, నగలును సీజ్ చేయరు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏటీఎంల్లో నగదు నింపేవారు కూడా తప్పనిసరిగా ఐడీ కార్డులు తమతో పాటు తీసుకుని వెళ్లాలని, అలా వారిని ఆదేశించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు కూడా ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఆధీకృత లేఖలు కూడా ఉండాలి. లేకపోతే ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ నగదును సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాబట్టి, మీరు పెద్ద మొత్తంలో నగదు బయటకు తీసుకుని వెళ్లేముందు సారి తగిన పత్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మీ డబ్బులు సీజ్ చేస్తారు. తర్వాత లబోదిబోమన్నా లాభం ఉండదు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1 జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల పోరు కూడా హోరాహోరీగా సాగుతోంది. నేతల మధ్య పోటాపోటీ మాటల తూటాలు పేలుతున్నాయి. డిసెంబర్ 4 ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 43, బీజేపీ 3, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీటులో గెలిచాయి.

మీరు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని బయటకు వెళ్తున్నారా...? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *