Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

చంద్రుడిపైనే ఇంధనం ఫ్యాక్టరీ...!

చంద్రుడిపైనే ఫ్యూయల్ఫ్యాక్టరీకి జపాన్శ్రీకారం చుట్టనుంది. చంద్రుడి ఉపరితల వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ నీటి జాడల కోసం ముమ్మర అన్వేషణలు సాగుతున్నాయి. చంద్రుడిపై నీటి ఆనవాళ్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్‌-1 ఇప్పటికే గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు నీరు మంచు రూపంలో ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భావిస్తోంది. ప్రదేశంలోని వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరిమెట్టుపై విఫలమయ్యింది.

అయితే, మంచునే ఇంధనంగా మార్చాలని జపాన్స్పేస్ఎక్స్ప్లోరేటరీ ఏజెన్సీ  (జాక్సా) నిర్ణయించింది. నాసాతో కలిసి ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు జాక్సా ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇంధన కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.

చంద్రుడిపై అన్వేషణ కోసం అంతరిక్ష యాత్రకు ఇంధనాన్ని భూమి నుంచి తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఖర్చు తడిసిమోపుడు అవుతోందని అంటోంది. ఖర్చు తగ్గించుకోవడం కోసమే 2035 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇంధనం తయారీ ప్లాంట్నిర్మాణానికి సిద్ధపడుతోంది. అక్కడ మంచు రూపంలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్వాయువులను సోలార్సెల్ద్వారా వేరు చేసి, వాటిని మళ్లీ కలపి ఇంధనాన్ని తయారుచేయనుంది. దీంతో చంద్రుడి కక్ష్యలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుడిపైకి వెళ్లే వ్యోమనౌకలకు ఉపయోగించే ఇంధనం అక్కడే లభిస్తుందని జాక్సా వెల్లడించింది. మరి ఇది మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

 

ప్రాథమిక అంచనాల ప్రకారం, చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించగలరు. మానవ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై దిగడానికి 37 టన్నుల నీరు అవసరమవుతుంది. 2024 నాటికి చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపాలని నిర్ణయించిన అమెరికా, జపాన్ ఏడాది జులైలో దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

 

చంద్రుడిపైనే ఇంధనం ఫ్యాక్టరీ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *