Top Ad unit 728 × 90

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు... షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు... షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్

 

టాలీవుడ్ డార్లింగ్ కొత్త సినిమా వస్తోందంటే అభిమానుల ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న హై టెక్నికల్ వాల్యూ మూవీ కల్కీ2898D(Kalki2898D).

 

స్టార్ ప్రొడ్యూసర్ కే.అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాక్మంగా భారీ బడ్జెట్‌తో అగ్రకథనాయకులతో సినిమా రూపొందుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కీ 2898ఏడీ బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప్రభాస్ కల్కీ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక ఈచిత్రంలో నటిస్తున్న లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్(AMITABH BACHCHAN), జాతీయ నటుడు కమల్ హాసన్(Kamalhasan) గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తికరైన వ్యాఖ్యలు చేశాడు. కల్కీలో కీలకమైన బుజ్జీ అనే ఓ కారును కూడా ఈ ఈవెంట్ లో ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కి ప్రభాస్ పెద్దమ్మ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇద్దరు టాప్ హీరోలతో కలిసి నటించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రభాస్ చెప్పాడు. అంతే కాదు నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ, వైజయంతి బ్యానర్ గొప్పతనం గురించి మాట్లాడాడు. చివరగా ప్రభాస్ తన పెళ్లికి సంబంధించిన వార్తపై కూడా తనపై తానే సెటైర్ వేసుకొని అభిమానుల్ని ఉత్సాహపరిచాడు.

 

కల్కీ గురించి ప్రభాస్...

ప్రభాస్ క్రేజీ మూవీ కల్కీ2898D కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మూవీ ఈవెంట్‌కి అటెండ్ అయిన ప్రభాస్ కల్కీ కోసం రూపొందించిన బుజ్జీ అనే కారును లాంచ్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతే కాదు ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్‌ నటించడం, వారితో నటించే అవకాశం రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు ప్రభాస్. కమల్‌ హాసన్, అమితాబ్ బచ్చన్ ను చూసే చిత్ర పరిశ్రమ స్పూర్తి పొందిందని మెచ్చుకున్నాడు. అలాంటి అగ్రనాయకులతో కలిసి పని చేయడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు ప్రభాస్. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ అశ్వీనిదత్‌కు థాంక్యూ చెప్పాడు ప్రభాస్. కమలహాసన్ సాగరసంగమం సినిమాలో కమల్ హాసన్ డ్రెస్సులు తనకు బాగా నచ్చాయని... అలాంటివి కొనివ్వమని మారం చేసేవాడ్ని అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని కూడా అందరితో షేర్ చేసుకున్నాడు ప్రభాస్.

 

గ్రేట్ ప్రోడ్యూసర్...

50ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తూ భారీ నిర్మాతగా పేరు తెచ్చుకోవడం అశ్వినీదత్ గొప్పతనానికి నిదర్శమని ప్రభాస్ తెలిపాడు. అశ్వీనిదత్‌కు డబ్బు భయం లేదని కల్కీ సినిమా నిర్మాతను పొగిడాడు. ఆయన బాటలోనే అశ్వినిదత్ కుమార్తెలు శ్రమిస్తున్నారని చెప్పాడు. ఇంకా ఈసినిమాలో తనతో నటించిన దీపికా పదుకొనె, దిశాపటానికి థాంక్స్ చెప్పాడు డార్లింగ్ ప్రభాస్.

 

బుజ్జి భైరవ ఈవెంట్...

బుధవారం నిర్వహించిన కల్కీ మూవీ ఈవెంట్‌కి స్పెషల్ హోస్ట్ వస్తున్నారని నిర్మాతలు పెట్టిన పోస్ట్‌పై కూడా ప్రభాస్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఈ పోస్ట్ వల్ల అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయ్యాయని వాళ్ల కోసమే తాను పెళ్లి చేసుకోలేదని తన పెళ్లి వార్తపై ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

 

డైరెక్టర్‌ని కొట్టాలన్న డార్లింగ్...

డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన టాలెంట్ ఉందని చెప్పాడు ప్రభాస్. మూడేళ్లుగా సినిమా తీస్తూ కేవలం 50సెకన్లు చూపిస్తారా మిమ్మల్ని కొట్టాలి సార్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టమని... ఇందుకు సహాకరించిన మహీంద్ర కంపెనీ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా థ్యాంక్స్ చెప్పాడు ప్రభాస్.

 

ఫ్యాన్స్ కి సారీ...

కేవలం భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈకార్యక్రమాన్ని అతి తక్కువ మంది మధ్యలో నిర్వహించామని... అభిమానులకు చెప్పాడు ప్రభాస్. ఈ ఈవెంట్‌కి కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ కూడా హాజరయ్యారు. ప్రభాస్ కల్కీ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 

బుజ్జి భైరవ ఈవెంట్...

బుధవారం నిర్వహించిన కల్కీ మూవీ ఈవెంట్‌కి స్పెషల్ హోస్ట్ వస్తున్నారని నిర్మాతలు పెట్టిన పోస్ట్‌పై కూడా ప్రభాస్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఈ పోస్ట్ వల్ల అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అయ్యాయని వాళ్ల కోసమే తాను పెళ్లి చేసుకోలేదని తన పెళ్లి వార్తపై ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

 

డైరెక్టర్‌ని కొట్టాలన్న డార్లింగ్...

డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన టాలెంట్ ఉందని చెప్పాడు ప్రభాస్. మూడేళ్లుగా సినిమా తీస్తూ కేవలం 50సెకన్లు చూపిస్తారా మిమ్మల్ని కొట్టాలి సార్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టమని... ఇందుకు సహాకరించిన మహీంద్ర కంపెనీ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా థ్యాంక్స్ చెప్పాడు ప్రభాస్.

 

ఫ్యాన్స్ కి సారీ...

కేవలం భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈకార్యక్రమాన్ని అతి తక్కువ మంది మధ్యలో నిర్వహించామని... అభిమానులకు చెప్పాడు ప్రభాస్. ఈఈవెంట్‌కి కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ కూడా హాజరయ్యారు. ప్రభాస్ కల్కీ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు... షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *