ప్రగతి భవన్ మాఫియా డెన్‌గా మారింది: ఎంపీ అరవింద్
ప్రగతి భవన్ మాఫియా డెన్‌గా మారింది: ఎంపీ అరవింద్
కేసీఆర్ కుటుంబంపై మరోసారి బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని నేను అనుకోను. కేటీఆర్‌కి ఏ అర్హత ఉందని సీఎం చేస్తానంటున్నారు. తెలంగాణ ద్రోహులందరూ మంత్రులయ్యరు. ప్రొఫెసర్. జయశంకర్‌ను కంట తడి పెట్టించిన మూర్ఖుడు కేసీఆర్. 80 వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని కేసీఆర్. ఆయన సంస్కార హీనుడు. పాస్‌పోర్టు బ్రోకర్ రాష్ట్రానికి సీఎం కావడం ప్రజల దురదృష్టకరం' అంటూ వ్యాఖ్యానించారు.
'ప్రగతి భవన్ మాఫియా డెన్‌గా మారింది. మై హోమ్ రమేశ్వర్ రావు ప్రాసిక్యూట్ అవుతారు. మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకి వెళ్లటం ఖాయం. బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీఆర్ఎస్కు లేదు. బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుంది. హిందువులపై మీ దాడులకు ప్రతి దాడులుంటాయి' అని అరవింద్ హెచ్చరించారు.
