Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 21జూన్ 2024 శుక్రవారం నుండి 27 గురువారం వరకు         

వారఫలితాలు తేదీ 21జూన్ 2024 శుక్రవారం నుండి 27 గురువారం వరకు         

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం చేపట్టిన పనులు లో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగా అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదురులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాలవారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం ఋణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్ధిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. తల్లి తండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూవివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 21జూన్ 2024 శుక్రవారం నుండి 27 గురువారం వరకు          Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *