Top Ad unit 728 × 90

యాదాద్రికి ఆధ్యాత్మిక శోభ...!

యాదాద్రికి ఆధ్యాత్మిక శోభ...!

 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. టెంపుల్‌ సిటీతోపాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న కాటేజీల నిర్మాణం ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్ర భావన వచ్చేలా ఉండాలని సూచించా రు. ఆలయ అభివృద్ధి కోసం రూ.43 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్‌లో సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు.

 

తొలుత గుట్ట చుట్టూ వాహనంలో గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా కొండ కింద ఉన్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో గుట్ట అభివృద్ధిపై మంత్రులు, వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైటీడీఏ పరిధిలో ఉన్న వంద ఎకరాల అడవిని నృసిం హ అభయారణ్యం పేరుతో అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుతో అద్భుత కల్యాణ మండపం నిర్మించాలని ఆదేశించారు. 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా, అద్భుతంగా నిర్మించాలని సూచించారు. వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలని దిశానిర్దేశం చేశారు. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్‌ హాల్‌, స్టేజీ, స్క్రీన్‌ ఏర్పాటు చేయాలన్నారు.

 

యాదాద్రికి ఆధ్యాత్మిక శోభ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *