Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో జూలై 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్రిటీష్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పొడగించింది. నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ హనుమాన్ పేట బైపాస్ వద్ద దారుణం జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బావ గఫార్‌ను బావమరిది సలీం హత్య చేశాడు. దేశంలో గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533. గడచిన 24 గంటల సమయంలో 155 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగింది.  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మారనున్న చెక్ పేమెంట్ రూల్స్

బ్యాంకింగ్ ఫ్రాడ్‌లను నివారించేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 1వ తేదీ నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బ్యాంకులకు ఆర్‌బీఐ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విధానం కింద రూ.50వేలు అంతకన్నా ఎక్కువ మొత్తం విలువ కలిగిన చెక్కులకు పేమెంట్లు చేసేటప్పుడు బ్యాంక్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు.

 

చెక్కులను ఇచ్చే వారి నుంచి ఎస్ఎంఎస్‌, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులు ఆ చెక్కులకు సంబంధించిన వివరాలను సేకరిస్తాయి. అంటే, చెక్కుపై వేసిన తేదీ, బెనిఫిషియరీ పేరు, చెల్లించాల్సిన మొత్తం వివరాలు తదితర సమాచారాన్ని బ్యాంకులు తీసుకుని బెనిఫిషియరీలకు చెల్లింపులు జరిపే సమయంలో సీటీఎస్ ద్వారా ఆ వివరాలను మరొకసారి క్రాస్ చెక్ చేస్తారు. దీంతో మోసాలకు ఆస్కారం ఉండదు.

 

అయితే రూ.50వేలు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని ఆర్‌బీఐ చెప్పినా బ్యాంకులు మాత్రం రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులనే ఈ విధానం ద్వారా క్రాస్ చెక్ చేయాలని చూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విధానాన్ని ఎంచుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టం అని, ఆ నిర్ణయాన్ని కస్టమర్లకే వదిలేస్తామని, కస్టమర్లు కోరితే ఈ విధానం కింద చెక్కులను క్రాస్ చేస్తామని, బ్యాంకులు తెలిపాయి.

మారనున్న చెక్ పేమెంట్ రూల్స్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *