Top Ad unit 728 × 90

బీఎస్‌-6 ప్రమాణాలతో హోండా గ్రేజియా 125

బీఎస్‌-6 ప్రమాణాలతో హోండా గ్రేజియా 125

 

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) బీఎస్‌-6 ప్రమాణాలతో గ్రేజియా 125 అర్బన్‌ స్కూటర్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.73,336గా (ఎక్స్‌-షోరూమ్‌, గురుగ్రామ్‌) నిర్ణయించింది. 125 సీసీ ఇంజిన్‌, డిస్టెన్స్‌ టు ఎమ్టీ, సరాసరి ఇంధన సామర్థ్యం, వాస్తవ ఇంధన సామర్థ్యం, ఐడ్లింగ్‌ స్టాప్‌ సిస్టమ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ విత్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి సమాచారం అందించే ఇన్‌స్ట్రూమెంట్‌ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు గ్రేజియా సొంతమని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. 'సరికొత్తగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన గ్రేజియా 125 బీఎస్‌-6 స్కూటర్‌ వినియోగదారులకు మంచి ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు ట్రెండ్‌సెట్టింగ్‌గా ఉంటుందని హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ డైరెక్టర్‌-సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా వెల్లడించారు. ఈక్వలైజర్‌ సాంకేతికతతో బ్రేకింగ్‌ ఫోర్స్‌ను ముందు, వెనుక చక్రాలపై ఒకేరీతిన కలిగించే కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌తో (సీబీఎస్‌) ఇది రూపొందిందని కంపెనీ పేర్కొంది.

బీఎస్‌-6 ప్రమాణాలతో హోండా గ్రేజియా 125 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *