Top Ad unit 728 × 90

మార్కెట్లు భారీ ఊగిసలాట ధోరణితో…!

మార్కెట్లు భారీ ఊగిసలాట ధోరణితో…!

 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల నుంచి ఏమాత్రం తేరుకోలేదు. మంగళవారం ఉదయం కూడా మార్కెట్లు భారీ ఊగిసలాట ధోరణితో మొదలయ్యాయి. కాకపోతే నిన్నటి స్థాయిలో భారీగా నష్టాలు లేకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఉదయం సెన్సెక్స్‌ 491 పాయింట్లు నష్టపోయి 30,898 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 9,069 పాయింట్ల వద్ద ట్రేడై, కొద్దిసేపటిలోనే తేరుకొని 9.38 సమయానికి సెన్సెక్స్‌ 49 పాయింట్ల లాభంతో 31,434 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతన్నాయి. నిన్న ఆర్‌బీఐ ప్రకటన కూడా మార్కెట్లలో భయాలను ఏమాత్రం తొలగించలేదు. ప్రీట్రేడింగ్‌లో మిశ్రమంగా ఉన్న సూచీలు ట్రేడింగ్‌ మొదలయ్యే సమయానికి నష్టాల్లోకి జారిపోయాయి. 

 

నిన్న వాల్‌స్ట్రీట్‌ భారీగా పతనం నమోదై ట్రేడింగ్‌ ఆగిపోవడం మదుపరుల్లో ఆందోళనలను రెట్టింపు చేసింది. ఆగస్టు వరకు కరోనవైరస్‌ను కట్టడి చేయలేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకొంటుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ సోమవారం చేసిన ప్రకటన ఆందోళనకరంగా ఉంది. దీంతో అమెరికా సూచీలు మొత్తం 10శాతానికి పైగా పతనం అయ్యాయి. నేటి ఉదయం జపాన్‌ సూచీ 2శాతానికి పైగా, దక్షిణ కొరియా సూచీ 3శాతానికి పైగా నష్ట్లాల్లో ఉన్నాయి.

 

మరోపక్క చమురు ధరలు కూడా భారీగా పతనం అవుతుండటంతో గల్ఫ్‌దేశాల ఆర్థిక వ్యవస్థలపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. గత వారాంతంలో సమస్య తీవ్రం కావడంతో మరిన్ని దేశాలు దిగ్బంధంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉండటంతో చమురు డిమాండ్‌ మరింత పడిపోయే ప్రమాదం ఏర్పడింది. యెస్‌బ్యాంక్‌, హెక్సావేర్‌, జమ్ము కశ్మీర్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ లాభాల్లో ఉండగా, ఫ్యూచర్స్‌ రిటైల్‌, పీవీఆర్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

 

మార్కెట్లు భారీ ఊగిసలాట ధోరణితో…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *