Top Ad unit 728 × 90

కొత్త చరిత్ర 43000 దాటిన సెన్సెక్స్...!

కొత్త చరిత్ర 43000 దాటిన సెన్సెక్స్...!

 

వరుసగా ఏడో రోజూ స్టాక్ బుల్ కాలు దువ్వింది. రోజంతా లాభాల దౌడు తీసింది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం వరుసగా రెండో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్ చేసి 43,278 వద్ద నిలిచింది. నిఫ్టీ 170 పాయింట్లు ఎగసి 12,631 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద గరిష్టాలను తాకాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 4 శాతం జంప్ చేయగా రియల్టీ 2 శాతం ఎగసింది. ఫార్మా, ఐటీ 4 శాతం స్థాయిలో పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫిన్, స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్సీఎల్ టెక్, దివీస్, నెస్లే, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, హిందాల్కో, మారుతీ, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ 6-1 శాతం మధ్య పతనమయ్యాయి. నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్చేయగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,036 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్కొనుగోలు చేయగా డీఐఐలు రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

కొత్త చరిత్ర 43000 దాటిన సెన్సెక్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *