Top Ad unit 728 × 90

భారత్‌లోకి బీఎండబ్ల్యూ 'డార్క్‌షాడో' ఎడిషన్‌

భారత్‌లోకి బీఎండబ్ల్యూ 'డార్క్‌షాడో' ఎడిషన్‌

 

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎక్స్‌7 ఎడిషన్‌లో డార్క్‌షాడో ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్ షోరూమ్‌ ధర రూ.2.02కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్‌ కార్లు కేవలం 500 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. సంస్థ ఎక్స్‌ క్లూజివ్‌ కస్టమైజేషన్‌ డివిజన్‌ దక్షిణ కరోలినాలోని ప్లాంట్‌లో దీనిని తయారు చేస్తోంది. కారుకు వేసిన రంగు అదనపు ఆకర్షణగా నిలవనుంది. దీనిని ఫ్రోజెన్‌ ఆర్కిటిక్‌ గ్రేమెటాలిక్‌ వర్ణంగా కంపెనీ పేర్కొంది. ఇటువంటి పెయింట్‌ ఫినిష్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి.

 

కార్‌ బాహ్యవర్ణం మొత్తం పూర్తి చిక్కటి నల్లటి రంగుతోనే ఇచ్చింది. బీఎండబ్ల్యూ మార్క్‌ కిడ్ని గ్రిల్స్‌ కూడా నలుపు రంగు క్రోమ్‌తోనే ఇచ్చారు. చివరికి ఎగ్జాస్‌ వ్యవస్థకు ఉన్న టెయిల్‌ పైప్‌సిస్టమ్‌ కవర్స్‌ కూడా నలుపు రంగులోనే ఉండటం విశేషం. ఈ కారు 22 అంగుళాల ఎం లైట్‌ అలాయ్‌ వీల్స్‌ను అమర్చారు. ఇవి వి స్పోక్‌ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కారు 6సీట్‌, 7సీట్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఇక ఇంటీరీరియర్లో నైట్‌ టోన్‌ బ్లూ, బ్లాక్‌ రంగులను వాడారు.

 

ఇక భారత్‌లో ఈ కారు ఎక్స్‌7 ఎం50ట్రిమ్‌ రేంజ్‌లోనే లభిస్తుంది. దీనిలో 3.0 సిక్స్‌ సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉంది. 8స్పీడ్ ట్రాంక్‌ స్పోర్ట్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అమర్చారు. ఈ ఇంజిన్‌ 400 బీహెచ్‌పీ శక్తి, 760 ఎన్‌ఎం టార్క్‌ ను విడుదల చేస్తుంది. ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని 5.4 సెకన్లలో అందుకొంటుంది.

భారత్‌లోకి బీఎండబ్ల్యూ 'డార్క్‌షాడో' ఎడిషన్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *