Top Ad unit 728 × 90

వామ్మో... పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా…!

వామ్మో... పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా…!

  

వరుసగా 18 వ రోజు అంటే ఈరోజు కూడా డీజిల్ ధరలో పెరుగుదల చోటుచేసుకుంది. అయితే వరుసగా 17 రోజులపాటు ధరలు పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలో ఈ రోజు మార్పు చోటుచేసుకోలేదు. ఈరోజు డీజిల్ ధరలు 48 పైసల మేరకు పెరిగాయి. ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ. 79.88 కు చేరుకుంది. ఈ పెరుగుదలతో దేశంలో మొదటిసారిగా పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా మారింది. విశేషమేమిటంటే చాలా నగరాల్లో పెట్రోల్ కంటే డీజిల్ ఇప్పటికీ చౌకగానే లభ్యమవుతోంది. ఢిల్లీ ప్రక్కనే ఉన్న నోయిడాలో డీజిల్ ధర లీటరుకు రూ. 72.03, ముంబైలో డీజిల్ రూ .78.22, చెన్నైలో రూ .77.17, కోల్‌కతాలో రూ .77.06 గా ఉంది.

 

కాగా పలు దేశాలలో డీజిల్ ధర తరచూ పెట్రోల్ కంటే ఎక్కువ ధరకు ఎగబాకుతుంది. దీనికి కారణం డీజిల్‌ ఉత్పత్తి వ్యయం కంటే పెట్రోల్ ఉత్పత్తి వ్యయం కొంచెం ఎక్కువ. అయితే ఇప్పటి వరకు మనదేశంలోని ప్రభుత్వాలు డీజిల్‌ను సబ్సిడీ పరిధిలో ఉంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. వ్యవసాయం, రవాణా, విద్యుత్ తదితర రంగాలలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వాలు డీజిల్‌ను పరిమిత ధరలకు అందిస్తూ వస్తున్నాయి. ఢిల్లీలో ఈరోజు లీటరు పెట్రోల్ ధర రూ. 79.76గా ఉంది.

వామ్మో... పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *