Top Ad unit 728 × 90

కేవలం రూ.7 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌…!

కేవలం రూ.7 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌…!

 

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ తయారీ సంస్థ రియల్‌ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ప్రకటించారు. ఒకటో రెండో కాదని, ఏకంగా 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే రియల్‌ మీ నార్జో5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.15,999 ఉండగా, రాబోయే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ.7వేలకే అందిస్తామని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

 

గ్లోబల్‌ 5జీ సమ్మిట్‌ వేదికగా మాధవ్‌ సేథ్‌ మాట్లాడుతూ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తాం. ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్‌ సంస్థల కంటే ముందుగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్‌ మీ పని చేస్తుందని" రియల్‌ మీ సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ చెప్పారు.

కేవలం రూ.7 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *