Top Ad unit 728 × 90

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్:​ యూఎన్

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్: యూఎన్

 

యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ వెల్లడి

పార్టనర్లు, కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నరు..

ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని కామెంట్

కలిసికట్టుగా అంతం చేద్దామని ప్రపంచ దేశాలకు పిలుపు

 

ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో శ్రద్ధ వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ 11 నిమిషాలకోసారి మహిళ లేదా బాలిక హత్యకు గురవుతోందని తెలిపారు. వారి పార్టనర్లు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. నవంబర్ 25న జరుపుకునే 'అంతర్జాతీయ మహిళలపై హింస-నిర్మూలన దినోత్సవం' ముందు గుటెర్రస్ ఈ కామెంట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. మహిళలు లేదా పిల్లలపై దాడి, హత్య అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని చెప్పారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని ప్రపంచ దేశాలకు సూచించారు.

 

2026 నాటికి 50శాతం నిధులు పెంచాలె

లైంగిక, భౌతిక దాడులను అడ్డుకోవడానికి ఇదే సరైన టైమని ఆంటోనియో గుటెర్రస్ నొక్కి చెప్పారు. ఇకపై దాడులు, హింస అనేవి చరిత్రగానే మిగిలిపోవాలని సూచించారు. ఈ విపత్తును పరిష్కరించేందుకు ప్రతీ దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళికల తయారీ, అమలు, నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించా రు. ప్రతీ దశలో అట్టడుగు వర్గాలు, సివిల్ సొసైటీ గ్రూప్లు ఇన్వాల్వ్ అయ్యేలా చూడాలన్నారు. అప్పుడే బాధితులకు సరైన న్యాయం లభిస్తుందని వివరించారు. 2026, నాటికి మహిళా హక్కుల సంస్థలకు, ఉద్యమాలకు 50% నిధులను పెంచాలని పిలుపునిచ్చారు. మహిళా హక్కులకు మద్దతుగా నిలవాలని, పురుషాధిక్యతను తిరస్కరించేలా అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది 'అంతర్జాతీయ మహిళలపై హింస-నిర్మూలన దినోత్సవం' థీమ్ 'యునైట్: మహిళలు, బాలికపై హింసను అంతం చేయడానికి క్రియాశీలం కావాలి' అని గుటెర్రస్ ప్రకటించారు.

 

వివక్ష, హింస పెరిగినయ్...

కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక సంక్షోభం దాకా ప్రతీ ఒక్కరు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ఈ ప్రభావంతో మహిళలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు, పిల్లలు... లైంగిక వేధింపులు, ఫొటోల ద్వారా బెదిరింపు లు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఇవన్నీ వారి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయన్నారు. పక్షపాతం, హింస, వివక్ష, వంటివి పెరిగి పోయాయని తెలిపారు.

 

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్:​ యూఎన్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *