Top Ad unit 728 × 90

కత్తితో కేక్ కట్‌చేసి కలకలం...!

కత్తితో కేక్ కట్‌చేసి కలకలం...!

 

భాగ్‌పట్: నలభై రోజుల పెరోల్‌పై గత శనివారంనాడు హర్యానాలోని రోహ్‌టక్ జిల్లా సునరియా జైలు నుంచి విడుదలైన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ బాబా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

 

జైలు నుంచి నేరుగా యూపీలోని భాగ్‌పట్‌లో ఉన్న బర్నావా ఆశ్రమానికి వెళ్లిన ఆయన ఆ సంబరాన్ని కేట్ కట్ చేసి జరుపుకొన్నారు. అయితే కేక్ కట్ చేయడం కోసం ఆయన పొడవాటి కత్తి (Sword) ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయుధాల చట్టం ప్రకారం బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం నిషేధం. కేట్ కట్ చేసిన సందర్భంలో ఐదేళ్ల తర్వాత తనకు ఈ అవకాశం వచ్చిందని, ఐదు కేక్‌లు కట్ చేయాలని, ఇది తొలి కేక్ అని డేరా బాబా చేసిన వ్యాఖ్యలు వీడియోలో వినిపిస్తున్నాయి.

 

హత్య, అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన గత 14 నెలల్లో పెరోల్‌పై బయటకు రావడం ఇది నాలుగోసారి. గత మూడు నెలల్లో పెరోల్‌పై బయటకు రావడం రెండోసారి. హర్యానా పంచాయతీ ఎన్నికలు, ఆదంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు 2022 అక్టోబర్‌లో ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరైంది.

 

కత్తితో కేక్ కట్‌చేసి కలకలం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *