Top Ad unit 728 × 90

పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌... ఇద్దరి మృతి

పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌... ఇద్దరి మృతి

 

శంఖవరం: ఖాళీగా ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం దాన్ని తీసుకొచ్చారు.

 

వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలింది. ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్‌ (38), బూరా సోమరాజు (39) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడి తీవ్రతకు ట్యాంకర్‌ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

 

పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌... ఇద్దరి మృతి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *