Top Ad unit 728 × 90

పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత, మరొకరి అరెస్ట్

పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత, మరొకరి అరెస్ట్

 

పాకిస్థాన్ నుంచి భారత దేశంలోకి చొరబడేందుకు ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళం విఫలం చేసింది.

 

వీరిద్దరూ మంగళవారం వేర్వేరు ప్రాంతాల నుంచి జమ్మూ-కశ్మీరులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరిని కాల్పులు జరిపి, మట్టుబెట్టగా, మరొకరిని అరెస్టు చేశారు.

 

బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం జమ్మూ-కశ్మీరులోని ఆర్నియా సెక్టర్, సాంబ జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టర్‌లలో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా మన దేశ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆర్నియా సెక్టర్‌లోకి దూకుడుగా చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. కంచె వైపు వస్తున్న ఆ వ్యక్తిని ఆగాలని చెప్పినప్పటికీ, ఆ వ్యక్తి వేగంగా రావడంతో కాల్పులు జరిపి మట్టుబెట్టారు.

 

రామ్‌గఢ్ సెక్టర్‌లో మన దేశంవైపు వచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బీఎస్ఎఫ్ దళాలు అరెస్ట్ చేశాయి. అతనిని కంచె తలుపు తెరచి, మన దేశంలోకి తీసుకొచ్చి, సోదాలు నిర్వహించారు. అతని వద్ద నేరపూరిత వస్తువులు, పత్రాలు వంటివేవీ దొరకలేదు.

 

 

 

పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత, మరొకరి అరెస్ట్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *