చికాగోలో విద్యార్థులపై కాల్పులు... ఒకరు మృతి
చికాగోలో విద్యార్థులపై కాల్పులు... ఒకరు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల నిమిత్తం చికాగో వెళ్లిన తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్, దేవాన్ష్ లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాల్ మార్ట్ కి వెళ్తుండగా నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వారి శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. ఈ కాల్పులలో సాయిచరణ్, దేవాన్ష్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వారిద్ధరిని మూడో విద్యార్థి హుటాహుటిన చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవాన్ష్ చనిపోయాడు. అయితే సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వీరికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సాయిచరణ్ తల్లిదండ్రులు బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయిచరణ్ స్నేహితులు జరిగిన ఘటనని అతని తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు.
చికాగోలో నల్ల జాతీయుల కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి సాయిచరణ్ గాయపడడం వారి కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది. సాయి చరణ్ త్వరగా కోలుకుని స్వదేశానికి తిరిగి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ ఎల్ఐసీ కాలనీకి ప్లాట్ నెంబర్(248) చెందిన శ్రీనివాసరావు లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సాయి చరణ్ చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో విద్యని అభ్యసిస్తున్నాడు. కాగా ఈరోజు ఉదయం చికాగోలో సాయిచరణ్ నల్ల జాతీయుల కాల్పుల్లో గాయపడ్డాడు. అక్కడినుండి ఆయన క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు ఎప్పటికీ అప్పుడు సాయి చరణ్ స్నేహితులు అందించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయిచరణ్ ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రావాలని సాయి చరణ్ తండ్రి శ్రీనివాసరావు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
