Top Ad unit 728 × 90

తల్లిని హత్య చేసిన కొడుకు

తల్లిని హత్య చేసిన కొడుకు

 

తల్లిని కన్న కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన కొప్పుల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డి అనే అతను శనివారం రోజు మధ్యాహ్నం 01:00 గంట ప్రాంతంలో ఇంటి పక్కనే వున్న చింత చెట్టు విషయంలో బేతు జైపాల్ రెడ్డితో గొడవ పడుతుండగా తిరుపతిరెడ్డి భార్య అయిన నాగరాణి చూసి తన భర్తని ఇంట్లోకి తీసుకొని వెళ్లింది.

 

తిరుపతిరెడ్డి తన భార్యతో గొడవపడి కొట్టబోగా తన తల్లి అయిన మోతే. అమృతమ్మ చూసి తన కొడుకును ఆపే ప్రయత్నం చేయగా కోపంలో ఉన్న తిరుపతిరెడ్డి పక్కనే ఉన్న మంచం అడ్డం పట్టెను తీసుకొని అమృతమ్మ తలపై కొట్టాడు. తలకి బలమైన గాయమై రక్తస్రావం జరగగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా శనివారం మధ్యాహ్నం 03:55 గంటలకు మృతురాలు మరణించింది. అమృతమ్మ కుమార్తె దూదిపాల రాణి ఫిర్యాదు మేరకు శాయంపేట ఎస్సై కేసు నమోదు చేయగా శాయంపేట రూరల్ సీఐ పి. రంజిత్ రావు దర్యాప్తు చేస్తున్నారు.

 

తల్లిని హత్య చేసిన కొడుకు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *