Top Ad unit 728 × 90

తాంత్రికుడి ముందు శృంగారం చేసిన జంట

తాంత్రికుడి ముందు శృంగారం చేసిన జంట, కట్ చేస్తే ఊహించని సీన్... చివరికి!

 

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు... వివాహేతర సంబంధాలు ఉచ్చులో పడి... పచ్చని కాపురాలు అతలాకుతలం అవుతున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.

 

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఉదయపూర్‌లోని కెలాబావాడి అటవీ ప్రాంతంలో నగ్నంగా దొరికిన ఓ వ్యక్తి, మహిళ మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి. అక్రమ సంబంధం కలిగి ఉన్న ఆ ఇద్దరిని అదే ఊరికి చెందిన 55 ఏళ్ల తాంత్రికుడైన భలేష్ కుమార్‌ హతమార్చాడని తెలియడంతో... సదరు వ్యక్తిని మూడు రోజుల అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ప్రాధమిక దర్యాప్తులో భాగంగా ఆ ఇద్దరిది పరువు హత్యగా అనుమానించిన పోలీసులు... తాంత్రికుడ్ని తమదైన శైలిలో విచారించిన అనంతరం... వారిని హత్య చేసింది తానేని అతడు అంగీకరించాడు. సంచలన విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి.

 

మృతులు 30 ఏళ్ల టీచర్ రాహుల్ మీనా, 28 ఏళ్ల సోను కున్వర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్, సోనూ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ కూడా భదవిగూడలోని భావ్‌జీ మందిర్‌లో ఉన్న తాంత్రికుడిని వారి కుటుంబాలతో అప్పుడప్పుడూ సందర్శించేవారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో రాహుల్, అతడి భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రాహుల్ భార్య తాంత్రికుడైన భలేష్ కుమార్‌ను సాయం కోరింది. గత ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా నివసిస్తున్న భలేష్ కుమార్... అక్కడున్న ప్రజలకు తానొక తాంత్రికుడని నమ్మించి.. వారికి తాయత్తులు ఇచ్చేవాడు. అలాగే రాహుల్ భార్య సోనూతో కూడా సన్నిహితంగా మెలుగుతూ... భర్త రహస్యంగా సాగిస్తోన్న అక్రమ సంబంధాన్ని సోనూ దగ్గర బట్టబయలు చేశాడు.

 

మరోవైపు తన అక్రమ సంబంధాన్ని భార్య ముందు బట్టబయలు చేసింది తాంత్రికుడేనని తెలుసుకున్న రాహుల్... అతడ్ని బెదిరించసాగాడు. ఇక ఎక్కడ ఇన్నేళ్లు కష్టపడి తాను నిర్మించుకున్న పేరు ప్రతిష్టలు పోతాయేమోనన్న భయంతో సదరు తాంత్రికుడు రాహుల్, సోనూలను హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే దాదాపు 50 ట్యూబ్‌ల ఫెవిక్విక్‌ కొనుగోలు చేసి బాటిల్‌లో నింపిన భలేష్ కుమార్‌... ఆ తర్వాత పధకం ప్రకారం... నవంబర్ 15వ తేదీ సాయంత్రం రాహుల్, సోనూలను అటవీ ప్రాంతానికి రావాలని చెప్పాడు. అక్కడికి చేరుకున్న వారిని తన ఎదుట శృంగారంలో పాల్గొనాల్సిందిగా కోరాడు.

 

ఇక ఆ ఇద్దరూ కూడా ఆ పనిలో ఉన్నప్పుడు తాంత్రికుడు ఫెవిక్విక్‌ను వారిపై పోశాడు. దీంతో రాహుల్, సోను చాలాసేపు ఒకరికొకరు అతుక్కుపోయారని... దూరం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు రాహుల్ ప్రైవేట్ పార్ట్ అతడి శరీరం నుంచి వేరు చేయబడటమే కాకుండా, సోనూ శరీరానికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాహుల్, సోనూ అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా భలేష్ కుమార్... వారిని హతమార్చి అక్కడ నుంచి పారిపోయాడు.

 

కాగా, మృతదేహాలు లభ్యమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న 50 సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేసి, సుమారు 200 మందిని విచారించిన అనంతరం... ఈ హత్యల వెనుక భలేష్ కుమార్ హస్తం ఉందని పోలీసులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపరచగా... న్యాయస్థానం అతడికి మూడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. రాహుల్ భార్యతో తరచూ భలేష్ కుమార్ ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయని, ముక్కోణపు ప్రేమ కోణంలో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

 

తాంత్రికుడి ముందు శృంగారం చేసిన జంట Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *