ఆస్తి కొట్టేయాలని యువతి పెళ్లి నాటకం... !
ఆస్తి కొట్టేయాలని యువతి పెళ్లి నాటకం... రూ.6.5కోట్లు స్వాహా
పెళ్లిసంబంధాలు చూడాలంటూ వివాహవేదికను సంప్రదించిన యువకుడిని వివాహ వేదికలో పనిచేస్తున్న రీనా అనే యువతి అతడి ఆస్తి కొట్టెయ్యాలని పెళ్లినాటకం ఆడింది.
పెళ్లికి ముందే తనకు తెలిసిన కంపెనీలో రూ.6.5కోట్లు మదుపు చేయించింది. పెళ్లైన పదిహేను రోజులకే విడిపోయింది. ఎందుకిలా చేశావంటూ ప్రశ్నిస్తే రౌడీలతో కొట్టించింది. బాధితుడి సోదరి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లో ఉంటున్న రవికుమార్ తగరం రెండున్నరేళ్ల నుంచి పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా వివాహ వేదికను నిర్వహిస్తున్న రీనా గొర్లె పరిచయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనా పెళ్లిచేసుకుంది. తరువాత పై విధంగా వ్యవహరించడంతో రవికుమార్ సోదరి పద్మజ ఫిర్యాదుతో సర్వోమాక్స్, వన్మాజ్ డైనమిక్స్, సుధీర్బొబ్బ, రీనా, రఘు, ప్రసాద్, వెంకట్, అనిల్లపై కేసు నమోదు చేశారు.
ఆస్తి కొట్టేయాలని యువతి పెళ్లి నాటకం... !
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
