Top Ad unit 728 × 90

గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఎదురీత!

గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఎదురీత!

 

దక్షిణ గుజరాత్‌లో కాషాయ సర్కారుపై ఆదివాసీల్లో వ్యతిరేకత

పటీదార్‌ల మద్దతుతో సూరత్‌లో సత్తా చాటుతామంటున్న ఆప్‌

 

గుజరాత్‌లో గిరిజన ప్రాంతాలలో అధికార బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందా? అంటే అవుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై గిరిజనుల్లో నెలకొన్న వ్యతిరేకత, వారికి మద్దతుగా ఆమ్‌ఆద్మీ పార్టీ చేస్తున్న ఆందోళనలు వెరసి బీజేపీకి ప్రతికూలత తప్పదన్న వాదన ఉంది. డిసెంబరు 1న తొలి విడతలో 93 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో దక్షిణాది జిల్లాలైన భారుచ్‌, నర్మదా, తాపి, డాంగ్‌, సూరత్‌, వల్సాడ్‌, నవ్‌సారిలలోనే 35 స్థానాలు ఉన్నాయు. 2017లో ఈ సీట్లలో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 8, భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ) రెండు స్థానాలను సొంతం చేసుకున్నాయి. షెడ్యూల్‌ ట్రైబ్స్‌కు రిజర్వు చేసిన 14 సీట్లలో బీజేపీ కేవలం ఐదు మాత్రమే గెలిచింది. అదే సమయంలో దక్షిణ గుజరాత్‌లో పట్టణ ఓటర్లు మాత్రం బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. సూరత్‌ ప్రాంతంలో పటిదార్‌ ఉద్యమం భారీగా జరిగినా, జీఎస్టీ అమలుపై టెక్స్‌టైల్‌ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా 16 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 15 సీట్లలో విజయం సాధించడం విశేషం.

 

ఈ సారి మాత్రం ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా మారింది. గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికలలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆప్‌ సూరత్‌ ఓటర్ల మనసు దోచింది. సూరత్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆప్‌ 27 చోట్ల విజయం సాధించింది. పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ సహచరుడైన అల్పేష్‌ కథిరియా సహా మరికొందరు పటీదార్‌ ఉద్యమ మద్దతుదారులను ఆప్‌ బరిలోకి దింపింది. ఈ క్రమంలో పటీదార్‌లు తమకు అండగా నిలుస్తారని ఆప్‌ నేతలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గిరిజనులు తమ వెంటే ఉంటారని కాంగ్రెస్‌ కూడా ధీమాగా ఉంది. ''గిరిజన ప్రాంతంలో అన్ని సీట్లను మేమే సొంతం చేసుకుంటాం. బీజేపీ క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోయింది.'' అని కాంగ్రెస్‌ ముఖ్య నేత తుషార్‌ చౌధరీ ధీమా వ్యక్తం చేశారు.

 

బరిలో 1,621 మంది అభ్యర్థులు

రెండు విడతల్లో జరగనున్న ఎన్నికలలో 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది. 182 అసెంబ్లీ సీట్లకు డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతలలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొదటి విడతలో పోలింగ్‌ జరగనున్న 93 స్థానాలకు 833 మంది బరిలో నిలవగా, రెండో విడతలో 89 స్థానాలకు 788 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఎదురీత! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *