బాబు , లోకేష్ పెద్ద ప్లానే వేశారే ?
బాబు , లోకేష్ పెద్ద ప్లానే వేశారే ?
రాజకీయ వ్యూహాలలో బాగా ఆరితేరిపోయిన టిడిపి అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలే టార్గెట్ గా తన రాజకీయ వ్యూహాలకు పదును పడుతూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేస్తూ, ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు, 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తన సత్తా చాటాలని జగన్ భావిస్తుండటం తో దానికి చెక్ పెట్టే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్లాలనే విషయం పై చంద్రబాబు ప్లాన్ చేశారు .
దానిలో భాగంగానే చంద్రబాబు జిల్లాల యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగానే మినీ మహానాడు ను నిర్వహిస్తూ... భారీ బహిరంగ సభల్లో మాట్లాడుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ తరహా యాత్రలను ఎన్నికల వరకు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు.
ఇక చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం జనాల్లో ఉంటూ బలం పెంచుకుంటేనే రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలము అని బలంగా నమ్ముతున్నారు. అందుకే పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్లో తన గ్రాఫ్ పెంచుకోవాలని, తద్వారా పార్టీని అధికారంలోకి సులువుగా తీసుకురావచ్చు అనే అభిప్రాయంతో లోకేష్ ఉన్నారు. పాదయాత్ర, జిల్లాల యాత్ర ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకుంటేనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వీలు కలుగుతుందని లోకేష్, చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.
అందుకే ఈ ఇద్దరు తమ యాత్ర ను పగడ్బందీగా నిర్వహించి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు . ఏపీ అంతటా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి బలమైన నాయకుడిగా తన గ్రాఫ్ పెంచుకోవాలని లోకేష్ భావిస్తున్నారట. అందుకే లోకేష్ తాను చేపట్టబోయే యాత్ర విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారట.
