Top Ad unit 728 × 90

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ.

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ.

 

మైలవరం (PSLVTV): భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం భూమి పూజ చేశారు.

 

రూ.13.50 లక్షల నిధులతో 950 మీటర్ల పొడవునా పైపులైన్ నిర్మించనున్నారు. ఈ పైపులైన్ వల్ల గుంటుపల్లి గ్రామంలో ఊరు చివర నివాస ప్రాంతాలకు కూడా తాగునీటి వసతి కలుగుతుంది. గ్రామం అంతా పరిపూర్ణంగా మంచినీటిని సరఫరా చేయనున్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్  మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్య నివారణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)

 

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *