నారా లోకేష్ పాదయాత్ర పై రోజా సంచలన వ్యాఖ్యలు...!
నారా లోకేష్ పాదయాత్ర పై రోజా సంచలన వ్యాఖ్యలు...!
వైసీపీ మంత్రి రోజా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టనున్న 'యువగళం' పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అన్నదానిపై క్లారిటీ కూడా ఆయనకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది 'యువగళం' కాదు తెలుగుదేశం పార్టీకి మంగళమని సెటైర్లు వేశారు. గతంలో లోకేష్ ప్రచారం చేసిన ప్రతి చోట టీడీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో లోకేష్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని... అలాంటప్పుడు ఆయన పాదయాత్రకు సెక్యూరిటీ ఎందుకని... రోజా ప్రశ్నించడం జరిగింది.
దొంగ ఓట్లతో కుప్పంలో చంద్రబాబు ఇంత కాలం గెలిచారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ ఓట్లను తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్ని ఉద్యోగాలను ఇచ్చారో... వివరాలు వెల్లడించాలని కోరారు. ఉద్యోగాలు విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధమని రోజా సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే ఈ నెల 27వ తారీఖున 'యువగళం' పాదయాత్రని లోకేష్ కుప్పం నుండి స్టార్ట్ చేయనున్నారు. దాదాపు 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను... లోకేష్ కలిసే రీతిలో రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగింది.
