Top Ad unit 728 × 90

ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ

ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ

 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులే ఉన్నాయి. ఎన్నికలు సమీపించినాకొద్ది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు.

 

ఇది ముగిసి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడారు. కాంగ్రెస్ నుంచి నేతలు బయటికి వెళ్లడం ఒక దెబ్బ అయితే వీరంతా అధికార బీజేపీలో చేరుతుండడం కాంగ్రెస్ పార్టీని మరింత కలవరానికి గురి చేస్తోంది. వెళ్లే వారంతా అటు ఇటుగా ఒకే విధమైన కారణాలు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వంలో లోపం, ఢిల్లీలోని అధిష్టానం పట్టించుకోకకపోవడం. తాజాగా పార్టీని వీడిన వారు కూడా రాష్ట్ర నాయకత్వం చర్యలతో నిరాశకు లోనయ్యామని, తాము సంతోషంగా లేమని పేర్కొన్నారు.

 

వెళ్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధిని సాకుగా చూపిస్తూ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయ్‌పుర్‌ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్‌ రావల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మరో నేత రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పార్మర్‌ మాట్లాడుతూ 'గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. పార్టీపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ, దురదృష్టవశాత్తు అధిష్టానం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించింది. నేనెప్పుడూ ఏ పదవులు కోరలేదు. కొద్ది రోజుల్లో చాలా మంది సీనియర్లు పార్టీని వీడతారు.' అని తెలిపారు. అయితే ఏదైనా సమస్య ఉంటే పార్టీతో చర్చించాలి కానీ, అనవసరపు నిందలు మోపి పార్టీని వీడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

 

ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *