మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికేనా?
మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికేనా?
ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను చర్చించేందుకు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ పార్టీ నేతలతో సోమవారం సమావేశం కాన్నారు.
ఈ స్థానాన్ని గతంలో కేటాయించినట్లు కూటమి పార్టీ కాంగ్రె్‌సకే డీఎంకే కేటాయించగా, గతంలో పోటీచేసిన టీఎంసీని ఒప్పించి ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో పోటీచేయలేదని పీఎంకే ప్రకటించగా, ఒంటరిగా పోటీచేయనున్నట్లు నామ్ తమిళర్ కట్చి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆళ్వార్‌పేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కమల్‌హాసన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా భావిస్తున్న కమల్ హాసన్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన జూడో పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. దీంతో, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రె్‌సతో జతకట్టేందుకు కమల్‌హాసన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడేలా ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తారా? ఒంటరి పోటీకి సిద్ధమవుతారా? మౌనంగా ఉంటారా అనే విషయాలపై సోమవారం సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.
