కౌలు రైతు చట్టాన్ని రద్దు చేస్తాం.
కౌలు రైతు చట్టాన్ని రద్దు చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నామని....
త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని అచ్చెన్న తెలిపారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించి రుణాలు వచ్చేలా చేస్తామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం నిర్వహించగా... అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలను అచ్చెన్న ప్రారంభించారు. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన... టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని సూచించారు.
కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలని అచ్చెన్న అధికారులకు సూచించారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రేపటి నుంచే పరిస్థితి మారాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలన్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. డిజిటైలేజేషన్‌తోనే అక్రమాలకు చెక్ చెప్పగలమన్నారు. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని... ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాల్లో జవాబుదారీతనం, పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని... సహకార వ్యవస్థలో EKYC అమలు చేయడంతో పాటు ఈ - ఆఫీస్ విధానంలో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు. స్పష్టం చేశారు. ఏపీలో ప్రతి కౌలు రైతుకూ న్యాయం జరగాలన్నారు. సాగు చేసే రైతుకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న ఆయన... పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాను.
పవన్‌కల్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో జల్‌జీవన్ మిషన్ నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గ్రామీణ రక్షిత నీటి సరఫరా అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు వ్యయమైన రూ. 4 వేల కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు... నీటి సరఫరా ప్లాంట్ నుంచి ఇంటి కుళాయి వరకు ప్రతి దశలో నిపుణులతో తనిఖీలు చేయించాలని పేర్కొన్నారు. తన నివాసంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షించారు. జల్‌జీవన్ మిషన్ పథకానికి రూ. 4 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారని, ఆ స్థాయిలో ఫలితాలు సాధించారా... అని అధికారులను ప్రశ్నించారు. నీటి సరఫరా ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్లు, ఇంటింటికీ కుళాయిల పనుల్లో జల్‌జీవన్ మిషన్ నిర్దేశించిన డిజైన్లు, సాంకేతిక అంశాలను సరిచూడాలని నిర్దేశించారు. పురోగతిలో ఉన్న జల్‌జీవన్ మిషన్ పనుల్లో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.