Top Ad unit 728 × 90

వైసీపీకి బిగ్ షాక్...!

వైసీపీకి బిగ్ షాక్...!

 

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం (PSLVTV): టీడీపీలోకి జూపూడి మాజీ వైస్ సర్పంచ్ తో సుమారు 20 కుటుంబాలు చేరిక.

 

గ్రామ, మండల తెలుగుదేశం పార్టీ నేతల సమక్షంలో పచ్చ కండావాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన మాజీ మంత్రి దేవినేని ఉమా.

 

గడిచిన ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి బేరీజీ వేసుకుని చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, తెలుగుదేశం పార్టీ బతికితేనే మనకు మనుగడ ఉంటుందని నమ్మి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటున్నట్లు జూపూడి వైసీపీ మాజీ ఉప సర్పంచ్ నీలం సురేష్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు గ్రామ, మండల తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో సుమారు ఇరవై కుటుంబాలు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. వీరందరినీ పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు దేవినేని ఉమా స్థానికి పార్టీ నేతల సమక్షంలో ఉద్ఘాటించారు. వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిలో బలసా ప్రభాకర్, కలతోటి బుజ్జిబాబు, బండి బాబురావు, జంగా పిచ్చయ్య, జంగా భాస్కరరావు, నీలం సతీష్ బాబు, లంకే శ్రీనివాసరావు, కొల్లి ఈశ్వర్ రావు, పీతా రాజు, లంకే శ్రీను, పానెం రవి, అవనిగడ్డ వీరంజజనేయులు, నడకుదిటి హనుమంతరావు, బలసా వరదయ్య, నీలం పిచ్చయ్య, బండి కళ్యాణి, లంకే బుల్లియ్య, ఎస్.కె. సలీం తదితర కుటుంబాల వారు పచ్చ కండువాలు కప్పుకున్నారు.

 

దేవినేని ఉమా కామెంట్స్

చంద్రబాబు నాయుడు  తెలుగు జాతి సంపద... తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు.

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాలనకు, మన తెలుగుదేశం కుటుంబానికి ఉన్న తేడా చూడండి ... జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు చూస్తారు కదా ఒక్కడే కూర్చుంటాడు

 

ప్రక్కన ఒక్క బిసి, ఎస్సీ నాయకుడు కుడా ఉండడు. అంతేకాదు పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్నవారు కూడా ఉండరు. అసలు ఎక్కడైనా పార్టీ మీటింగ్ లో ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడా?

 

జగన్‌ సర్కార్‌ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రతి శాఖనూ, ప్రతి ప్రభుత్వ సంస్థనూ అప్పుల కుప్పగా మార్చేసింది

 

ఈ అవకతవకల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు ‘బటన్‌ నొక్కుడు’ పేరిట సంక్షేమ పథకాలను ఇప్పుడే కొత్తగా అమలు చేస్తున్నట్లు కథలు చెబుతోంది

 

కాచి, కాచి వడపోస్తే ఏలా నిజాలు వస్తాయో, నమ్మి మోసపోయిన గుండెలు ఈరోజు అ విధంగా మాట్లాడుతున్నాయి

 

నేడు బాధపడుతూ ఉన్నారు, రాష్ట్రం పోయింది మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని..

 

ఇక్కడ డాబా మీద నుంచి చూస్తే అక్కడ రాజధాని ప్రాంతంలో 50 వేల మంది కార్మికులు పనిచేస్తా ఉంటే మీరు చూసి నా రాజధాని రూపు దిద్దుకుంటుంది అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆనందంగా ఉండేవారు

 

అక్కడ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతోంది... నా పిల్లవాడికి రేపు ఈ ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది... ఉద్యోగం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే అమరావతి లో ఉండొచ్చు

 

మన పిల్లలు ఇంజనీరింగ్ చదవడానికి దేశంలో అత్యున్నత సంస్ధలు VIT, SRM, AMRUTH వంటివి నాడు చంద్రబాబు నాయుడు  తీసుకొచ్చారు. అవి తమిళనాడు లో కుడా ఉన్నాయి కానీ ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ఉన్నాయి

 

అలా కాకుండా మనకు రాజధాని అమరావతి లో ఒకేచోట మూడు ప్రఖ్యాత సంస్థలు వచ్చాయి. వాటి నుంచి సంవత్సరానికి 20 వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అమరావతి లో ఉన్న ఈ 3 సంస్థల్లో 2 దేశంలో టాప్ ఉన్నాయి

 

వైకాపా పాలనలో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు

 

తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యవసర వస్తువుల ధరలు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ రెట్లు ఏ విధంగా ఉన్నాయో మరి ఈరోజు ఈ నిత్యవసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగాయో ప్రజలు ఆలోచించాలి

 

వరద వచ్చి, 15 రోజులుగా మోకాల్లోతు నీటిలో ఉన్నారు... మనుషులు చచ్చారా, బతికారా అనేది ఎవరూ చూడలేదు... బియ్యం గానీ, పాల ప్యాకెట్‌ గానీ  జగన్ సర్కార్ ఇవ్వలేదు

 

రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి వైసిపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి.

 

కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)

 

వైసీపీకి బిగ్ షాక్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *