Top Ad unit 728 × 90

కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని వ్యాఖ్యానించిన కోర్టు…!

కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని వ్యాఖ్యానించిన కోర్టు…!

 

5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితమని టెలికాం సంస్థల సంఘం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తాజాగా స్పష్టం చేసింది. ప్రజారోగ్యంపై ఈ సాంకేతికత ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్న భయాలు అనవసరమని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలన్ని 5జీ టెక్నాలజీ సురక్షితమచి చెబుతున్నట్టు సీఓఏఐ పేర్కొంది. ఈ టెక్నాలజీ భారత్ టెలికారం రంగంలో ఓ గేమ్ ఛేంజర్ అని, దీని వల్ల ఆర్థికరంగానికి సమాజానికి ఇబ్బడిముబ్బడిగా ప్రయోజనాలు చేకూరుతాయని కూడా స్పష్టం చేసింది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీ విషయమై వేసిన కేసులో బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఓఏఐ ఈ ప్రకటన జారీ చేసింది.

 

కాగా, టెలికాం టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కు సంబంధించి భారత్‌లో కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని టెలికాం ఆపరేటర్ల సంఘం స్పష్టం చేసింది. రేడియేషన్‌ స్థాయిలపై భారత్ ప్రభుత్వం విధించిన పరిమితులు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా కఠినమని తెలిపింది. '' ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే కేవలం పదో వంతు రేడియేషన్ స్థాయిని మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. కాబట్టి, రేడియేషన్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయాలు అనవసరం. ఇవన్నీ తప్పుడు భయాలు, కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టే ప్రతిసారి ఇలా జరుగుతుంటుంది'' అని సీఓఏఐ పేర్కొంది.

 

5జీ టెక్నాలజీ ప్రతికూల ప్రభావాలను ప్రస్తావిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యం లోపభూయిష్టమైనదని, న్యాయప్రక్రియ దుర్వినియోగమైందని, కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని వ్యాఖ్యానించిన కోర్టు, నటి జుహీ, ఇతర పిటిషనర్లపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ప్రజారోగ్యంపై 5జీ టెక్నాలజీ ప్రతికూల ప్రభావం చూపించొచ్చంటూ జుహీ వ్యక్తం చేసిన అనుమానాలు వివాదం సృష్టించే విధంగా ఉన్నాయని జస్టిస్ జేఆర్ మిధా వ్యాఖ్యానించారు. ఈ చిల్లర వ్యాఖ్యానాలు వెగటు పుట్టిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పును స్వాగతించిన టెలికాం ఆపరేటర్ల సంఘం, 5జీపై దురుద్దేశంతో రేకెత్తించిన వదంతులకు ఈ తీర్పు చెక్ పెట్టినట్టైందని వ్యాఖ్యానించింది.

 

కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని వ్యాఖ్యానించిన కోర్టు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *