Top Ad unit 728 × 90

ఇకపై గూగుల్ ఫొటో ఎడిటింగ్ ఫీచర్స్ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే...!

ఇక పై గూగుల్ ఫొటో ఎడిటింగ్ ఫీచర్స్ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే...!

 

టెక్దిగ్గజం గూగుల్ గత రెండు నెలలుగా గూగుల్ ఫొటోలకు ప్రీమియం ఎడిటింగ్ ఫీచర్లను జోడించే పనిలో ఉంది. అద్భుతమైన ఫొటో మేనేజ్మెంట్‌, ఎడిటింగ్యాప్గా గూగుల్ఫొటోస్పాపులర్అయింది. యాప్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రిప్షన్సర్వీస్ను లాంచ్చేసింది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన కొన్ని ఎడిటింగ్ట్రిక్కులకు ఇకపై డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. యూజర్లకు ఇబ్బందికరంగా అనిపించినా తప్పదని గూగుల్ యాజమాన్యం అంటుంది. గూగుల్ ఫొటోస్ బ్యాకప్ వరకూ ఓకే కానీ, ఫిల్టర్లు యూజ్ చేసి ఫొటోను మార్చుకోవాలనుకుంటే మాత్రం చెల్లించాల్సిందేనట. గూగుల్ ఫొటోలు v5.18 వెర్షన్ను ఇటీవల ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కొత్త వెర్షన్ను ఓపెన్ చేసిన తర్వాతే పేమెంట్ ఆప్షన్ను చూపిస్తుంది. ఇప్పటికే కొంత మంది యూజర్లకు ఫీచర్ కనిపిస్తుందట. యూకేలో యూజర్ యాప్ ఓపెన్ చేసి కలర్ పాప్ ఫీచర్ ఉపయోగించబోతుండగా గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ అడిగింది. స్క్రీన్షాట్లను ఎక్స్డీఏ డెవలపర్స్ మిషాల్ రెహ్మాన్పోస్టు చేశారు. వన్ సబ్స్క్రిప్షన్తో నెలకు 1.59 జీబీపీని ఎడిట్ చేసుకోవచ్చు. యూకేలో ప్లాన్ నిమిత్తం 100జీబీ స్టోరేజికి నెలకు 1.99యూరోలు వసూలు చేస్తుంది. ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే వన్ సబ్స్క్రిప్షన్ కోసం పేమెంట్ చేసిన తర్వాత కూడా కలర్ పాప్ ఫీచర్ అన్లాక్ అవలేదట. ఇంకా గూగుల్ ఫీచర్ గురించి అధికారికంగా అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాక్షన్ తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుండొచ్చు. యూకేలో వసూలు చేసిన దానిని బట్టి చూసుకుంటే ఇండియాలో దీని కోసం 100జీబీకి రూ.130 వరకూ వసూలు చేయనుంది.

 

ఇకపై గూగుల్ ఫొటో ఎడిటింగ్ ఫీచర్స్ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *