Top Ad unit 728 × 90

District News :

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు…!

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు…!

 

క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Scooter), కస్టమర్లకు పది రంగుల ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 15న విపణిలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ వెల్లడించారు. అదే రోజు తమ స్కూటర్‌లో ఫీచర్లు, స్పెషిపికేషన్లు బహిర్గతం అవుతాయని మంగళవారం ట్వీట్ చేశారు.

 

పది రంగుల ఆప్షన్లలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విపణిలో ఆవిష్కరించేందుకు ఓలా ఎలక్ట్రిక్ సిద్ధం అవుతున్నది. బ్లాక్‌, వైట్‌, గ్రే, ఎల్లో, రెడ్‌, బ్లూ కలర్స్‌తోపాటు వాటి షేడ్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికైతే కంపెనీ అధికారికంగా స్కూటర్ ధర వెల్లడించలేదు. కానీ రూ.85 వేలు పలుకవచ్చునని కొన్ని వార్తలొచ్చాయి.

 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణతోపాటు దాని చార్జింగ్ కోసం 400 సిటీల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది. లక్షకి పైగా ప్రాంతాల్లో హైపర్ చార్జర్ కేంద్రాలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. కనుక చార్జింగ్ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎటువంటి ఇబ్బందుల్లేవు.

 

ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీన్ని ఇంటి వద్ద చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా స్కూటర్‌తోపాటు హోం చార్జర్ కూడా ఇస్తారు. రెగ్యులర్ వాల్ సాకెట్‌తో కస్టమర్లు దీన్ని చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 18 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. అయితే 75 కిలోమీటర్ల రేంజి వరకు ప్రయాణించొచ్చు. ఇంకా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫెసిలిటీ కూడా ఉంది. రెండు హెల్మెట్ల బూట్ స్పేస్ కూడా ఇందులో కల్పించారని తెలుస్తున్నది.

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *