Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

రియల్‌మీ కొత్త బడ్జెట్‌ ఫోన్‌…!

రియల్‌మీ కొత్త బడ్జెట్‌ ఫోన్‌…!

 

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతంలో మంచి ఆదరణ పొందిన సీ2కు కొనసాగింపుగా సీ3 పేరిట కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ మొబైల్‌ ధర, స్పెసిఫికేషన్లు, అందుబాటులో ఉండే తేదీపై ఓ లుక్కేద్దాం.

రియల్‌మీ సీ3 మొత్తం రెండు వేరియంట్లలో వస్తోంది. ఇందులో 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధరను రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను రూ.7,999గా పేర్కొంది. బ్లేజింగ్‌ రెడ్‌, ఫ్రోజెన్‌ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్‌లలో ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్‌సేల్‌కు రానుంది. త్వరలో ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్‌ ఆఫర్‌ కింద రూ.7,550 విలువైన జియో ప్రయోజనాలు, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్‌పై ఎలాంటి ఫోన్‌పైన అయినా వెయ్యి రూపాయలు తగ్గింపు లభించనున్నాయి.

 

 

రియల్‌మీ సీ3 ఆండ్రాయిడ్‌ 10తో కూడిన రియల్‌మీ యూఐతో పనిచేయనుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ 3తో వస్తోంది. మీడియా టెక్‌ హీలియో జీ70 ప్రాసెసర్‌ను ఇందులో వినియోగించారు. మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా 256 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 12 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరాను అమర్చారు. 5 ఎంపీ ఏఐ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

 

రియల్‌మీ కొత్త బడ్జెట్‌ ఫోన్‌…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *