Top Ad unit 728 × 90

District News :

త్వరలో రియల్​మీ మొట్టమొదటి ట్యాబ్…!

త్వరలో రియల్మీ మొట్టమొదటి ట్యాబ్…!

 

స్మార్ట్ఫోన్స్ అమ్మకాల్లో దూసుకుపోతున్న రియల్ మీ.. ఇక ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లను కూడా తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీ నుంచి ఓ ట్యాబ్ను, ల్యాప్టాప్ను లాంచ్ చేయనున్నట్టు రియల్ మీ ఇండియా సీఈవో మాథవ్సేత్ ప్రకటించారు. రియల్ మీ ప్యాడ్ పేరుతో ట్యాబ్లెట్, రియల్మీ బుక్ పేరుతో ల్యాప్టాప్ రానున్నాయి. ఈ రెండింటిని ఒకేసారి లాంచ్ చేయాలని రియల్మీ ప్లాన్ చేస్తోంది. సంస్థ మొట్టమొదటి ట్యాబ్లెట్ను పాట్ పేరుతో తీసుకొస్తామని రియల్ మీ జీటీ స్మార్ట్ఫోన్ గ్లోబర్ ఈవెంట్లో కూడా కంపెనీ ప్రకటించింది. అయితే స్పెసిఫికేషన్లు, డిజైన్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

అయితే రియల్మీ ప్యాడ్కు సంబంధించిన ఫొటో ఒకటి లీకైంది. ఓ అమ్మాయి రియల్మీ ప్యాడ్ పట్టుకున్న ఫొటో బయటకు వచ్చింది. దూరం నుంచి ఈ ఫొటో తీయడంతో వివరాలు అంతగా క్యాప్చర్ కాలేదు. అయితే ట్యాబ్లెట్ స్లిమ్గా ఉండి.. స్టాండర్డ్ కెమెరా ఉన్నట్టు అర్థం అవుతోంది. అయితే రియల్ మీ ప్యాడ్ అల్యూమినియమ్ ఫ్రేమ్తో వస్తుందని అర్థమవుతుంది. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది మాత్రం ఫొటోలో స్పష్టంగా కనిపించడం లేదు.

రియల్ ప్యాడ్ హైఎండ్ స్పెసిఫికేషన్లతో వస్తుందనేది అంచనా. ఫ్లాగ్షిప్ హార్డ్వేర్ ఇందులో ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్తో పాటు ఎక్కువ స్టోరేజీ ఆప్షన్లలో ఈ ట్యాబ్ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికీ తమ తొలి ట్యాబ్లెట్కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని రియల్ మీ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే దీనికి సంబంధించి లీక్లు కూడా పెద్దగా రావడం లేదు. అయితే ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో రావడం మాత్రం పక్కా అనిపిస్తోంది. అయితే త్వరలోనే ట్యాబ్, లాప్ట్యాప్ వివరాలను రియల్ మీ ఒక్కొక్కటిగా వెల్లడించే అవకాశం ఉంది.

మరోవైపు తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చేందుకు కూడా రియల్ మీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రూ.10వేల లోపు 5జీ ఫోన్ను తీసుకురావాలని భావిస్తోంది. రూ.20వేల లోపు ఇప్పటికే రియల్ మీ నార్జో 30 ప్రో, రియల్ 8 5జీ, రియల్ ఎక్స్7 ఫోన్లకు మంచి స్పందన రావడంతో మరిన్ని మోడళ్లను తెచ్చేందుకు రియల్ మీ ఉత్సాహం చూపుతోంది. అలాగే తన ఫ్లాగ్షిప్ మోడల్ రియల్మీ జీటీని త్వరలో భారత్కు తీసుకురానుంది. ఇటీవలే రియల్ మీ సీ 11 పేరిట బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.6,999గా ఉంది.

త్వరలో రియల్​మీ మొట్టమొదటి ట్యాబ్…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *