Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 సేల్ ప్రారంభం...!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 సేల్ ప్రారంభం...!

 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ మనదేశంలో మధ్యే గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫ్లిప్ కార్ట్‌లో ప్రారంభం అయింది. బిగ్ బిలియన్ డేస్‌లో సందర్భంగా ఫోన్ ప్రస్తుతం తక్కువ ధరకే అందుబాటులో ఉండటం విశేషం. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని శాంసంగ్ అందించింది. ఫోన్ ద్వారా యువతను ఆకర్షించాలన్నదే శాంసంగ్ ప్రణాళిక. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,999గానూ నిర్ణయించారు. ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ఫ్యూజన్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ కింద కంపెనీ ఫోన్‌పై రూ.1,500 తగ్గింపును అందిస్తోంది. దీంతో దీని ధర రూ.15,499కు తగ్గనుంది. ఎస్బీఐ కార్డు ద్వారా దీన్ని కొనుగోలు చేసే వినియోగదారులు అదనంగా 10 శాతం తగ్గింపును పొందుతారు. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-యూ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌పై స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సెన్సార్ ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ లను కూడా ఇందులో శాంసంగ్ అందించింది. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకభాగంలో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. స్మార్ట్ ఫోన్ మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 191 గ్రాములుగానూ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 సేల్ ప్రారంభం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *