Top Ad unit 728 × 90

 పదివేల లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలా...!

పదివేల లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలా...!

 

స్మార్ట్ ఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. అయితే, బడ్జెట్ అనుకూలించదు. బడ్జెట్ తక్కువలో ఫోన్ కొన్నా అంతగా అది పనిచేయదు. ముఖ్యంగా రామ్ తక్కువ ఉండే ఫోనులే తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి. అయితే, ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో యిప్పుడు తక్కువ బడ్జెట్ లో అందరికీ అందుబాటులో ఉండేలా దీపావళి కానుకగా మంచి ఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఒప్పో 15 స్మార్ట్ఫోన్ విడుదల చేసిన ఒప్పో దానిలోనే ఇంకొంచెం తక్కువలో రెండో వేరియంట్ విడుదల చేసింది. 15 స్మార్ట్ఫోన్ మొదటి వేరియంట్ 3 జీబీ + 32 జీబీ ఫోన్ మార్కెట్లో ఉంది. దీని ధర 9,990 రూపాయలు. ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువ ధరలో 2జీబీ+32జీబీ వేరియంట్లో కొత్త మోడల్ని పరిచయం చేస్తోంది ఒప్పో. ఫోన్ ధర 9,490 రూపాయలు. ఇక ఫోన్ ఇప్పుడు రిటైల్ మార్కెట్ తో పాటు.. అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. ఫోన్ ప్రత్యేకతలు చూస్తె 7.9ఎంఎం సైజ్లో ఉండే సన్నని స్మార్ట్ఫోన్ ఇది. 6.52 అంగుళాల వాటర్డ్రాప్ డిస్ప్లే, 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీ+ రెజల్యూషనల్, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ చిప్సెట్ లాంటి ప్రత్యేకతలు ఫోన్ లో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో చురల్ బ్యూటీ, ఏఐ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్, త్రీ ఫింగర్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

 పదివేల లోపు మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *